Begin typing your search above and press return to search.
భారత ఆస్తుల్ని జఫ్తు చేసిన ఫ్రాన్స్.. ఇంతకీ కెయిర్న్ వివాదం ఏమిటి?
By: Tupaki Desk | 8 July 2021 5:00 PM ISTఅంతర్జాతీయ సమాజంలో భారత్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత్ ప్రభుత్వానికి చెందిన ఇరవై ఆస్తుల్ని స్వాధీనం చేసుకునేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వానికి కోర్టు అనుమతిని ఇచ్చింది. బ్రిటన్ కు చెందిన కెయిర్న్ ఎనర్జీ కంపెనీకి భారత్ ప్రభుత్వం బాకీ పడిన మొత్తాన్ని తిరిగి చెల్లించే విషయంలో నడుస్తున్న వివాదలో భాగంగా ఆర్బిట్రేషన్ కోర్టు తాజా ఆదేశాలు జరీ చేయటం సంచలనంగా మారింది. ఫ్రాన్స్ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే భారత్ ఆస్తుల విలువ దగ్గర దగ్గర 20 మిలియన్ యూరోల విలువ ఉంటుందని చెబుతున్నారు. మన రూపాయిల్లో దాదాపుగా రూ.178.8 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. పారిస్ నడిబొడ్డున ఉన్న భారత ప్రభుత్వానికి చెందిన 20 మిలియన్ యూరోల విలువైన ఫ్లాట్లు.. ఇతరఆస్తుల్ని స్వాధీనం కానున్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన చట్టపరమైన లాంఛనాలు తాజాగా పూర్తి అయినట్లుగా చెబుతున్నారు.
ఈ ప్లాట్లలో నివసిస్తున్న భారతీయ అధికారుల్ని కెయిర్న్ కంపెనీ ఖాళీ చేయించే అవకాశం లేదంటున్నారు. అదే సమయంలో కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ ఆస్తుల్ని అమ్మటానికి భారత్ కు వీలు ఉండదు. ముగ్గురు సభ్యులు ఉన్న అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్ ఈ ఆదేశాల్ని ఇచ్చింది. అయితే.. ఈ తీర్పును అమలు చేయటానికి భారత ప్రభుత్వం రిజెక్టు చేసింది. దీంతో.. కెయిర్న్ సంస్థ ఓవర్సీస్ జ్యురిడిక్షన్స్ ను ఆశ్రయించింది. ఈ వివాదాన్ని తాము సామరస్య పరిష్కారానికి తాముప్రాధాన్యత ఇస్తున్నట్లుగా కెయిర్న్ ఎనర్జీ అధికారిక ప్రతినిధి ఒకరు మీడియాతో చెప్పారు.
ఇంతకీ.. కెయిర్న్ ఇష్యూ ఏమిటి? ఎందుకింత వివాదంగా మారిందన్న విషయాన్ని చూస్తే.. 2006లో ఈ కంపెనీకి కేంద్ర ప్రభుత్వ పన్నుల విభాగం నోటీసులు జారీ చేసింది. వాటిని పరిశీలించిన పన్ను శాఖ 2015లో సదరు కంపెనీని రూ.10,247 కోట్ల పన్నులు చెల్లించాలని స్పష్టంచేసింది. ఇదిలా ఉంటే 2010-11లో కెయిర్న్ ఎనర్జీ భారత్ లోని తన అనుబంధ సంస్థ అయిన కెయిర్న్ ఇండియాను ‘వేదాంత’ సంస్థకు అమ్మేసింది. ఈ క్రమంలో వేదాంతలో ప్రిఫరెన్షియల్ షేర్లతో పాటు ఐదు శాతం వాటాలు ఇచ్చారు. దీంతో.. వేదాంతలో కెయిర్న్ ఎనర్జీకి ఉన్న ఐదు శాతం షేర్లను భారత సర్కారు అటాచ్ చేసింది.
అంతేకాదు.. రూ.1140 కోట్ల డివిడెండ్లు.. రూ.1590 కోట్ల ట్యాక్స్ రీఫండ్ నిలిపివేసింది. తమకు రావాల్సిన పన్ను వసూలు కోసం తాము అటాచ్ చేసిన వేదాంత షేర్లను అమ్మేసింది. అయితే.. ఈ విధానం చట్ట విరుద్ధమని పేర్కొంటూ భారత్ మీద అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టును ఆశ్రయించింది కెయిర్న్ సంస్థ. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. భారత్ తీరును తప్పు పట్టింది. భారత ప్రభుత్వం నిలిపివేసిన డివిడెంట్లు.. ట్యాక్స్ రీఫండ్ .. షేర్ల విక్రయంతో కలిగిన నష్టం నేపథ్యంలో భారత ప్రభుత్వమే తిరిగి కెయిర్న్ ఎనర్జీకి 1.2 బిలియన్ డాలర్లు చెల్లించాలని పేర్కొంది. ఈ ఆదేశాల్ని సవాలు చేస్తూ భారత ప్రభుత్వం కూడా పిటిషన్ దాఖలు చేసింది. భారత్ ఆస్తుల్ని పారిస్ లో స్వాధీనం చేసుకున్న వైనం షాకింగ్ గా మారింది. మరి.. దీనిపై ఫ్రాన్స్ ప్రభుత్వం తీరుకు భారత్ రియాక్షన్ ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికకరంగా మారింది.