Begin typing your search above and press return to search.

ఆన్ లైన్ లో చూసి శ్మశానంలో క్షుద్రపూజలు..నలుగురు యువకులు అరెస్ట్!

By:  Tupaki Desk   |   3 Oct 2020 5:20 PM IST
ఆన్ లైన్ లో చూసి శ్మశానంలో క్షుద్రపూజలు..నలుగురు యువకులు అరెస్ట్!
X
ప్రస్తుతం ప్రపంచం ఆధునికంగా పరుగులు పెడుతుంది. కంప్యూటర్ యుగం నడుస్తుంది. రాకెట్స్ వేసుకొని మనం ఆకాశంలోకి వెళ్తున్నాం. ఇలా ప్రపంచం ఎంతో ముందుకుపోతున్న ఈ సమయంలో కూడా కొంతమంది మంత్రాలకు చింతకాయలు రాలుతాయి అని ఇంకా మూఢనమ్మకాలని నమ్ముతున్నారు. అయితే , ఆ మూఢ నమ్మకాలను ఫాలో అవడానికి మళ్లీ ఇప్పటి టెక్నాలజీని కూడా వాడుకుంటున్నారు. ఆన్ లైన్ లో విద్యార్థులు ఎలా క్లాసులు వింటున్నారో అలాగే , నలుగురు యువకులు ఆన్‌లైన్‌లో క్షుద్రపూజలు నేర్చుకోవడం ప్రారంభించారు.

క్షుద్రపూజలు ఎలా చేయాలి? దానికి కావాల్సిన వస్తువులేంటీ? ఏఏ సమయంలో ఎక్కడ ఎటువంటి సమయంలో చేయాలి? క్షుద్రపూజలు చేసేటప్పుడు ఎటువంటి మంత్రాలు జపించాలి? అనే విషయాలను ఆన్ లైన్ లో నేర్చుకున్నారు.. సవివరంగా ఆన్లైన్ లో చూసి ఓ అవగాహనకి వచ్చారు. అయితే అర్ధరాత్రి స్మశానంలో పూజలు నిర్వహిస్తున్న సమయంలో అడ్డంగా దొరికిపోయారు. నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ ఘటన పై పూర్తి వివరాల్లోకి వెళ్తే .. గోవిందపురం గ్రామానికి చెందిన నలుగురు యువకులకు క్షుద్రపూజలు నేర్చుకోవాలని దుర్బుద్ధి పుట్టింది. అర్ధరాత్రి శ్మశానానికి వెళ్లి ఏవేవో మంత్రాలు చదవసాగారు. ఫోన్‌లో ఎవరో మంత్రాలు చదువుతుంటే వీరు కూడా వాటిని పఠించసాగారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న కొందరు గ్రామస్తులు శ్మశానంలో యువకులును చూసి షాక్ అయ్యారు. రాత్రివేళ వాళ్లు శ్మశానంలో ఏం చేస్తున్నారని దగ్గరకు వెళ్లి చూశారు. క్షుద్రపూజలు చేస్తున్నారని గ్రహించి వారు మరింత షాక్ అయ్యారు. వెంటనే స్థానికులకు ఫోన్‌లో సమాచారం అందించారు. దీంతో మరికొందరు గ్రామస్తులు అక్కడికి వచ్చారు. ఇక్కడ ఏం చేస్తున్నారని యువకులను నిలదీశారు.

దానికి వారు, ఇంట్లో సమస్యలు తొలగిపోవడానికి పూజలు చేస్తున్నామని సమాధానం చెప్పారు. నలుగురిలో ఒకడైన ఇట్టి రాము.. తన అత్తగారి ఫొటోతో పాటు, మరో అమ్మాయి ఫొటో ఉంచి క్షుద్రపూజలు చేసినట్లు ఆధారాలు లభించాయి. అలాగే రెండు నలుపు రంగు కోళ్లు, పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, తాయత్తులు, వేపకొమ్మలు వంటివి అక్కడ దొరికాయి.వారికి ఎవరో ఫోన్‌లో మంత్రాలు చదివి వినిపిస్తుంటే వీళ్లు అవే మంత్రాలు బిగ్గరగా చదువుతూ ఆ ఫొటోలపై పసుపు, కుంకుమ చల్లుతూ రెండు కోళ్లను బలిచ్చినట్లు అంగీకరించారు. దీంతో స్థానిక పెద్దలు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు వచ్చి వారిని అరెస్ట్ చేసి , ఆ మంత్రాలు చదివే వ్యక్తి ఎవరు అని ఆరా తీస్తున్నారు.