Begin typing your search above and press return to search.

ఆ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఫోన్లలో బెదిరింపులు

By:  Tupaki Desk   |   12 Nov 2022 6:13 AM GMT
ఆ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఫోన్లలో బెదిరింపులు
X
మునుగోడు ఉప ఎన్నికల వేళ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోళ్లు చేస్తూ పట్టుబడ్డ ముగ్గురు ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్నారు. ఒకబ్రోకర్, ఇద్దరు స్వామీజీలు ఊచలు లెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తెలంగాణ ప్రభుత్వం థ్రెట్ దృష్ట్యా పటిష్ట భద్రతను ఏర్పాటు చేసింది. టీఆర్ఎస్ ప్రభుత్వంను కూల్చేందుకు వచ్చినా అమ్ముడుపోకుండా నిలబడ్డ ఈ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇప్పుడు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిసింది.

ఇక సోషల్ మీడియాలో తీవ్రంగా దూషిస్తున్న తీరును గమనిస్తున్నారు. ముఖ్యంగా ఈ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బీజేపీ పాలిత రాష్ట్రాలైన యూపీ, గుజరాత్ నుంచి ఫోన్లు చేసి అంతుచూస్తామని బెదిరిస్తున్నారని సమాచారం. తాజాగా అమితాన్షు శేఖర్ అనే వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చిందని తెలిసింది. ఒక్కోసారి ఒక్కో కొత్త నంబర్ తో ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో వెనక్కి తగ్గాలని.. ఆ దిశగా కేసీఆర్ పై ఒత్తిడి తేవాలని..లేకుంటే ఈడీ, ఐటీ, సీబీఐ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని టీఆర్ఎస్ నేతలకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని సమాచారం.

ఢిల్లీ వ్యక్తలే వందల కోట్లు ఆశచూపి.. భయపెట్టినా బెదరనితాము..ఈ ఉడత ఫోన్ బెదిరింపులకు భయపడబోమని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటున్నారు.

ఈ బెదిరింపులపై ఎమ్మెల్యేలు పోలీసులకు పిర్యాదు చేయనున్నట్టు సమాచారం. శుక్రవారం ఈ విషయమై ఎమ్మెల్యేలు పార్టీ పెద్దలతో సమావేశమైనట్టు తెలిసింది. బెదిరింపులను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం.. ఎమ్మెల్యేల భద్రతను కట్టుదిట్టం చేయాలని పోలీస్ ఉన్నతాధికారులకు సూచించింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.