Begin typing your search above and press return to search.

ఏడాదిలో నాలుగు భారీ క్యాసినో ఈవెంట్లు.. ఏడుగురికి ఈడీ నోటీసులు..

By:  Tupaki Desk   |   30 July 2022 11:30 AM GMT
ఏడాదిలో నాలుగు భారీ క్యాసినో ఈవెంట్లు.. ఏడుగురికి ఈడీ నోటీసులు..
X
తెలుగురాష్ట్రాల్లో సంచలనమైన 'క్యాసినో' కేసులో ఈడీ దూకుడు పెంచింది. చీకోటి ప్రవీణ్ తోపాటు మరో ముగ్గురు లావాదేవీలు, బ్యాంకు అకౌంట్లను పరిశీలించిన ఈడీ మొత్తంగా రూ.25 కోట్ల లావాదేవీలను గుర్తించినట్లు తెలుస్తోంది. ఆ నగదు అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? ఎలా మార్పిడి చేశారు? వంటి అంశాలపై ఈడీ దర్యాప్తు చేసే అవకాశం ఉంది. తాజాగా ఈడీ ఈ కేసులో ఏడుగురికి నోటీసులు జారీ చేసింది. వారంతా సోమవారం తమ ఎదుట హాజరుకావాలని స్పష్టం చేసింది.

ఏడుగురిలో మొదటి వ్యక్తి చీకోటి ప్రవీణ్ కాగా.. రెండో వ్యక్తి మాధవరెడ్డి, మూడో వ్యక్తి సంపత్, మిగతా నలుగురు హవాలా ఆపరేటర్లు. వీరందరి అకౌంట్లను పరిశీలించిన తర్వాత నోటీసులు జారీ చసింది. చీకోటి ప్రవీణ్ వద్ద స్వాధీనం చేసుకున్న ఫోన్లు, కంప్యూటర్ ఇతర ఆధారాలను సాకేంతికంగా విశ్లేషించిన తర్వాత పెద్ద ఎత్తున కేసినో నిర్వహణ, హవాలా లావాదేవీలకు సంబంధించిన సమాచారం తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది.

ప్రాథమిక ఆధారాలు లభించడంతో చీకోటి ప్రవీణ్ తోపాటు మాధవరెడ్డి, సంపత్, ఇతర హవాలా ఆపరేటర్ల దగ్గర నుంచి మరిన్ని వివరాలు రాబట్టి హవాలా ద్వారా నగదు చెలామణీ చేసిన వారికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. వీరంతా ప్రస్తుతానికి కేసినోలు, హవాలాకు పాల్పడిన వారే. అలా వ్యవహరించి కమీషన్లు పొందారు. కానీ అసలు డబ్బులు చెలామణి చేసిన వారిలో ఎక్కువ మంది పంటర్లు ఉన్నారు.

కేసినోలకు అలవాటు పడిన ప్రముఖులు, రాజకీయ నేతలు, సంపన్నులు చీకోటి ప్రవీణ్ ద్వారా గోవా, నేపాల్, బ్యాంక్ కేసినోలకు వెళ్లేవారు. వారు ఇక్కడ నగదు రూపంలో లక్షలు చీకోటి ప్రవీణ్ అతడి ఏజెంట్లకు చెల్లిస్తే .. వారు ఏ దేశానికి వెళతారో? ఆ దేశం కరెన్సీని కమిషన్ మినహాయించుకొని సమకూరుస్తారు.ఇలా కరెన్సీ కంటే ఎక్కువగా వారు కేసినోలో ఆడే కాయిన్స్ ఇస్తారని చెబుతున్నారు. తర్వాత అక్కడ ఓడిపోతే ఇక్కడ తీసుకునే సమస్య ఉండదు.

ఇక కేసినోల్లో విదేశాల్లో గెలుచుకుంటే వాటిని వైట్ మనీగా ఇండియాకు చేర్చే బాధ్యత కూడా చీకోటి ప్రవీణ్ తీసుకుంటారని చెబుతున్నారు. దానికీ కమిషన్ పొందుతాడని అంటున్నారు.

కేసినో చట్టబద్ధమా? కాదా? అన్నది ఇప్పుడు ఈడీ దర్యాప్తు చేయడం లేదు. కేసినో పేరుతో జరిగిన హవాలా లావాదేవీలపైనే దృష్టి సారించింది. ఫెమా చట్టాన్ని వీరు ఉల్లంఘించినట్టుగా ఈడీ అధికారులకు ఆధారాలు లభించినట్టు తెలుస్తోంది. ఈ కోణంలోనే ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు.