Begin typing your search above and press return to search.

నగ్నంగా చేసి.. యూరిన్ పోసి ..ఏంచేశారంటే ?

By:  Tupaki Desk   |   17 March 2020 7:00 AM IST
నగ్నంగా చేసి.. యూరిన్ పోసి ..ఏంచేశారంటే ?
X
ఈ సమాజం లో రోజురోజుకి అసలు మానవత్వమనేదే లేకుండా పోతుంది. అసలు ఈ సమాజం లో ఆడపిల్లలకే కాదు, మగపిల్లలకు కూడా సరైన రక్షణ లేకుండాపోతుంది. తాజాగా సమాజం సిగ్గు తో తలదించుకునే ఈ ఘటన మహారాష్ట్ర లో చోటు చేసుకుంది. చంద్రపూర్ జిల్లాలోని గోపాల్ పట్టి ప్రాంతంలో వరద్ వినాయక్ సొసైటీ లో భారతి గౌతమ్ అవచ్చారే కుటుంబం నివాసం ఉంటోంది. శ్రేయాస్ గౌతమ్ అవచ్చారే కొడుకు ఉన్నాడు. కాలనీ లో శివ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అక్కడకు వెళుతున్నట్లు తన తో చెప్పాడని తల్లి భారతి వెల్లడించింది.

అయితే. కానీ తిరిగి ఇంటికి చేరుకోలేదు. హదాస్ పూర్ పీఎస్‌లో గురువారం ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి గాలింపులు చేపట్టారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. అందులో యువకుడు బట్టలు లేకుండా,కాళ్లు కట్టేసి ఉండడం కనిపించాయి. దారుణంగా కొట్టినట్లుగా ఉంది. ఎదురుగా ఆరుగురు కత్తులు పట్టుకుని, యువకుడిపై యూరిన్ పోస్తూ పైశాచిక ఆనందం పొందారు. వీడియో చూసిన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మంజ్రీ రైల్వే స్టేషన్ వద్ద ఓ యువకుడు సృహ లేకుండా పడి ఉన్నాడని పోలీసులకు సమాచారం అందింది.

తమ కుమారుడేనని తల్లిదండ్రులు గుర్తించారు. ఇతడిని సాసున్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఘటనలో ఆరుగురు పాల్గొన్నట్లు గుర్తించారు. వినీత్ సూర్యాకాంత్, శుభం రాజభవు, దేవిదాస్ ఘన్ శ్యామ్, భారత్ విశాల్ రాథోడ్ నలుగురిని అదుపులోకి తీసుకుని మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అరెస్టయిన వారికి మార్చి 19 వరకు పోలీసు కస్టడీ విధించారు.