Begin typing your search above and press return to search.

నీరా కేఫ్.. తాగి మరీ ప్రారంభించిన కేటీఆర్

By:  Tupaki Desk   |   24 July 2020 10:45 AM IST
నీరా కేఫ్.. తాగి మరీ ప్రారంభించిన కేటీఆర్
X
కాఫీ కేఫ్ లు చూశాం.. టీ కేఫ్ లు చూశాం.. కానీ ‘నీరా కేఫ్’లు చూశారా? ఇప్పుడు తెలంగాణలో కొత్తగా వెలుస్తున్నాయి. కల్లుతోపాటు వచ్చే ‘నీరా’ అనే ద్రావణం చాలా ఔషధ గుణాలు కలది.. బలవర్థకమైనది దీన్ని గ్రామాల్లో చాలా మంది తాగుతుంటారు.

విస్కీ, రమ్ము, బీరు లాంటి మద్యం కంటే నీరా నూరు పాళ్లు నయం అని వైద్య నిపుణులు కూడా తేల్చారు. అందుకే ఇప్పుడు ఆ నీరాను ప్రజలందరి ఆరోగ్యం కోసం వినియోగించడంతోపాటు కల్లు గీత కార్మికులకు ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం సిద్ధమైంది.

కులవృత్తులతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతున్నదని మంత్రి కేటీఆర్ తాజాగా అన్నారు. కల్లు గీత కార్మికుల అస్తిత్వానికి ‘నీరా కేఫ్’ పత్రీకగా అన్నారు. హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో ‘నీరా కేఫ్’ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కులవృత్తులకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని కేటీఆర్ అన్నారు.ఈ కార్యక్రమంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.