Begin typing your search above and press return to search.
తలపై నుంచి విమానం.. వీడియో వైరల్!
By: Tupaki Desk | 27 Sept 2016 10:03 AM ISTవిమానం తలపైనుంచి వెళితే ఎలా ఉంటుంది.. తలపై నుంచే కదా విమానాలు వెళ్లేది అని అనుకుంటున్నారా... అయితే తలపైన కేవలం ఒక అరడుగు ఎత్తునుంచి విమానం వెళ్లిపోతే? అమ్మో.. ఇంకేమైనా ఉందా ఆ సౌండ్ కే గుండాగిపోతుంది. ఇంకాస్త కిందకు దిగితే తల, మొండెం వేరయిపోతుంది! అయితే ఈ రెండు ప్రమాదాల నుంచి తృటిలో తప్పించుకున్నాడు థాం రిచర్డ్. నమ్మశక్యంగా లేకపోయినా నమ్మాల్సిన విషయం ఇది! ఎందుకంటే... వీడియో ప్రూఫ్ ఉంది మరి!!
సాంకేతిక సమస్య కారణంగా ఒక విమానాన్ని రన్ వేపై ఆపిన పైలట్ కు తృటిలో పెనుప్రమాదమే తప్పింది. అమెరికాలో నిర్వహించిన రెనో జాతీయ ఎయిర్ రేసుల చాంపియన్ షిప్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ క్రమంలో థామ్ రిచర్డ్ అనే పైలట్ రేసును పూర్తి చేసి రన్ వేపై సురక్షితంగా ల్యాండ్ అయ్యాడు. ఇది గమనించని మరో విమాన పైలట్ విమానాన్ని ఆపకుండా పోనిచ్చాడు. అది బుల్లెట్ కంటే వేగంగా థామ్ తల మీదుగా వెళ్లి రన్ వే మీద ఆగింది.
థామ్ తలపై నుంచి విమానం బుల్లెట్ వేగంతో వెళ్లడం గమనించిన రన్ వే వద్ద సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని చికిత్స నిమిత్తం అతడిని తరలించారు. థామ్ విమానం కాక్ పిట్ పై ఉన్న కెమెరాలో ఘటనకు సంబంధించిన వీడియో రికార్డయింది. ఆ వీడియోను యూట్యూబ్ లో పోస్టు చేసిన థాం... బుల్లెట్ కంటే వేగంగా విమానం తన తలపై నుంచి వెళ్లిందని తన ఫేస్ బుక్ పేజీలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో ఆన్ లైన్ లో వైరల్ అయ్యింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/