Begin typing your search above and press return to search.

కరోనా నుండి కోలుకొని కన్నుమూసిన కేంద్ర మాజీమంత్రి

By:  Tupaki Desk   |   13 Sept 2020 2:20 PM IST
కరోనా నుండి కోలుకొని కన్నుమూసిన కేంద్ర మాజీమంత్రి
X
కేంద్ర మాజీ మంత్రి , బీహార్ రాష్ట్ర ప్రముఖ రాజకీయవేత్త, ఆర్జేడీ మాజీ నేత రఘువంశ్ ప్రసాద్ సింగ్ ఢిల్లీలోని ఎయిమ్స్ లో ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 74 ఏళ్ళు. ఇటీవల కరోనా బారినపడ్డ ఆయన కరోనా నుండి కోలుకొని ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత అనారోగ్య సమస్యలు తలెత్తడంతో వారం క్రితం ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు.కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ-1 ప్రభుత్వంలో రఘువంశ్ ప్రసాద్ సింగ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా వ్యవహరించారు. గ్రామీణ, వ్యవసాయాభివృద్ది రంగంలో నిపుణుడిగా అయన ఎంతో పేరు పొందారు. గ్రామీణ ఉపాధి పథకం రూప కల్పనకు, దాని అమలుకు రఘువంశ్ ప్రసాద్ సింగ్ విశేషంగా కృషి చేశారు. బీహార్ లో వైశాలీ పార్లమెంటరీ నియోజకవర్గానికి అయిదు సార్లు ప్రాతినిధ్యం వహించిన రఘువంశ్ ప్రసాద్.. 2014 ఎన్నికల్లో ఓటమి పాలైయ్యారు. ఇకపోతే ,బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కి చిరకాల సన్నిహితుడు. కాగా, ఆర్జేడీ పార్టీలో కీలక నేతగా ఉన్న రఘువంశ్‌ గురువారమే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన మృతికి పలువురు రాజకీయ నేతలు తీవ్ర సంతాపం ప్రకటించారు.