Begin typing your search above and press return to search.

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీడీపీ మాజీ ఎంపీ?

By:  Tupaki Desk   |   20 July 2020 9:00 AM IST
వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీడీపీ మాజీ ఎంపీ?
X
ఏపీ శాసనమండలిలో మొత్తం నాలుగు సీట్లు ఖాళీ అయ్యాయి. గవర్నర్ కోటాలో ఖాళీ అయిన రెండు స్థానాల కోసం అభ్యర్థుల పేర్లను ఖరారు చేయడంలో జాప్యం అనివార్యం అవుతోంది. ఇప్పటిదాకా ఏ ఒక్క పేరును వైసీపీ అధిష్టానం అధికారికంగా ప్రకటించలేదు. దీంతో ఆశావహుల్లో సందడి నెలకొంది. రోజుకో పేరు తెరపైకి వస్తోంది.

వైసీపీ మండలి రేసులో రోజుకో కొత్త పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత మర్రి రాజశేఖర్ పేరు బలంగా వినిపించింది. ఈయనతోపాటు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సీనియర్ నేత కొయ్య మోషేన్ రాజు పేరు వినిపించింది. ఇక కడప జిల్లా రాయచోటికి చెందిన ఓ మైనార్టీ నేతను ఎంపిక చేశారంటూ లీకులు వచ్చాయి.

తాజాగా వీరందరినీ కాదని.. టీడీపీ మాజీ ఎంపీ.. వైసీపీలో చేరిన పండుల రవీంద్రబాబు.. కడప జిల్లాకు చెందిన మైనార్టీ నాయకురాలు జకియా ఖానుం పేర్లు కొత్తగా ప్రచారం అవుతున్నాయి. రవీంద్రబాబు ఎస్సీ కాగా.. జకియా ముస్లిం.. దీంతో ఈ ఇద్దరికీ సామాజిక కోణంలో ఇస్తున్నట్టు లీకులు వస్తున్నాయి.

ఇలా రోజుకో పేరు తెరపైకి వస్తూ వైసీపీ అధిష్టానం లీకుల ద్వారా అభిప్రాయ సేకరణ చేస్తున్నట్టు తెలుస్తోంది. వీరిలో ఎవరిని గవర్నర్ కోటాలో ఎంపిక చేస్తారన్నది వేచిచూడాలి.