Begin typing your search above and press return to search.

మాజీ స్టార్ క్రికెటర్‌ అరెస్ట్

By:  Tupaki Desk   |   20 Oct 2021 11:00 PM IST
మాజీ స్టార్ క్రికెటర్‌ అరెస్ట్
X
ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మన్ మైకేల్ స్లేటర్‌ అరెస్ట్ అయ్యాడు. గత వారం వెలుగుజూసిన ఓ గృహ హింస ఘటనలో పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నట్లు ఆస్ట్రేలియన్ మీడియాలో బుధవారం కథనాలు వచ్చాయి. ఈ కేసులో ఇన్వెస్టిగేషన్‌ మొదలైందని న్యూ సౌత్ వేల్స్ పోలీసులు తెలిపారు. స్లేటర్‌ను అరెస్ట్ చేశామని.. మాన్లీ పోలీసు స్టేషన్‌ కు తరలించామని పోలీసులు ఓ ప్రకటలో తెలిపారు. గృహహింస ఆరోపణల నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ మైకేల్‌ స్లాటర్‌ అరెస్టైనట్లు సమాచారం.

సిడ్నీలోని మాన్లీలో గల తన నివాసంలో స్లాటర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వారం రోజుల క్రితం జరిగిన ఓ ఘటన ఆధారంగా అందిన ఫిర్యాదు మేరకు అతడిని అరెస్టు చేసినట్లు న్యూసౌత్‌ వేల్స్‌ పోలీసులు వెల్లడించారు. గృహహింస ఆరోపణల నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ మైకేల్‌ స్లాటర్‌ అరెస్టైనట్లు సమాచారం. సిడ్నీలోని మాన్లీలో గల తన నివాసంలో స్లాటర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వారం రోజుల క్రితం జరిగిన ఓ ఘటన ఆధారంగా అందిన ఫిర్యాదు మేరకు అతడిని అరెస్టు చేసినట్లు న్యూసౌత్‌ వేల్స్‌ పోలీసులు వెల్లడించారు.

ఈ మేరకు... అక్టోబరు 12న, గృహహింస ఘటనకు సంబంధించి ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఈస్టర్న్‌ సబర్బ్స్‌ పోలీసులు విచారణ చేపట్టారు. దర్యాప్తు ఆధారంగా బుధవారం ఉదయం 9 గంటల 20 నిమిషాలకు అతడిని అరెస్టు చేశాం అని ప్రకటన విడుదల చేశారు. అయితే, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించిన మైకేల్‌ స్లాటర్‌.. టెస్టు బ్యాటింగ్‌ టాపార్డర్‌ లో చోటు దక్కించుకున్నాడు. కెరీర్‌లో మొత్తంగా 5312 పరుగులు చేసిన స్లాటర్‌.. 2004లో ఆటకు వీడ్కోలు పలికాడు. బ్రాడ్‌కాస్టర్‌గా, టెలివిజన్‌ పండిట్‌గా గుర్తింపు సంపాదించాడు.