Begin typing your search above and press return to search.

మాజీ ప్రధాని పీవీ.. 65 ఏళ్ల వయస్సులో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్నారా..!

By:  Tupaki Desk   |   24 Dec 2022 9:30 AM GMT
మాజీ ప్రధాని పీవీ.. 65 ఏళ్ల వయస్సులో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్నారా..!
X
తెలుగువారంతా గర్వంగా చెప్పుకునే నాయకుడు పీవీ నరసింహారావు. తెలంగాణ ప్రాంతానికి చెందిన పీవీ నరసింహారావు బహుముఖప్రజ్ఞశాలి. పుస్తకాలు చదవడం.. సంగీతం వినడమంటే ఆయనకెంతో ఇష్టం. అంతే కాకుండా కొత్త కొత్త విషయాలను తెలుసుకునే ఆయన ఎప్పుడు ఆసక్తి చూపించేవారు. ఇక 65 ఏళ్ళ వయస్సులో అనే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకునేందుకు కుస్తీలు పట్టారు.

1985లో రాజీవ్ గాంధీ ప్రధాని ఉన్నారు. ఆ సమయంలో పీవీ నరసింహారావు రక్షణ మంత్రిగా ఉన్నారు. రాజీవ్ కు మొదటి టెక్నాలజీ అంటే ఎంతో ఆసక్తి. ఈ క్రమంలోనే ఆయన భారత్ లోకి ఎలక్ట్రానిక్ కంప్యూటర్.. దిగుమతులను అనుమతించాలని భావించారు. ఈ విషయాన్ని ఆయన తన స్నేహితుడితో మాట్లాడుతున్న సమయంలో పీవీ అక్కడే ఉన్నారు.

అప్పటికి పీవీ నరసింహారావుకు కంప్యూటర్ తో పెద్దగా పరిచయం లేదు. రాజీవ్ కు మాత్రం పూర్తి స్థాయి అవగాహన ఉంది. ఇక తమ పార్టీలోని పాత వాళ్లకు కంప్యూటర్ పై అవగాహ తక్కువ కాదా? అని రాజీవ్ తో అన్నారు. ఈక్రమంలోనే అదేరోజు సాయంత్రం హైదరాబాద్‌లో ఉంటున్న తన కుమారుడు ప్రభాకర్ రావుకు ఫోన్ చేసి పీవీ మాట్లాడారు.

అప్పటికే ప్రభాకర్ రావు తన తండ్రితో తాను పెట్టదలుచుకున్న కంపెనీ కంప్యూటర్లపై ఎలాంటి స్టడీ చేస్తుందో చెప్పారు. ఆయనకది గుర్తుండడంతో అందుకు సంబంధించిన శాంపిల్స్.. నివేదికలు ఉంటే పంపించామని పీవీ తన కుమారుడి సూచించారు. ప్రభాకర్ రావు కు హైదరాబాద్లో సొంత కంపెనీ నడిపేవారు. ఆయనకు టీవీ.. కంప్యూటర్ సంబంధిత యూనిట్లు నెలకొల్పే ఆలోచన ఉండేది.

తన వద్ద కొన్ని విడి భాగాలతో తయారు చేసి మూడు ప్రోటో టైప్ డెస్క్ టాప్‌లు ఉండేవి. అయితే ఆ తర్వాత ఆయన టీవీ బిజినెస్‌లోకి దిగారు. అయితే పీవీ కాల్ చేయడంతో ప్రభాకర్ రావు వెంటనే ఒక ప్రోటోటైపు కంప్యూటర్‌ని దిల్లీ పంపించారు. అంతేకాకుండా ఆయనకు కంప్యూటర్ నేర్పించడానికి ఒక టీచరును కూడా ఏర్పాటు చేశాడు. అలా 65 ఏళ్ల వయస్సులో పీవీ నర్సింహరావు కంప్యూటర్ నేర్చుకోవడం ప్రారంభించారు.

అయితే ఆయనకు తన కంప్యూటర్ టీచర్ నచ్చకపోవడంతో తన కుమారుడిని కంప్యూటర్ ఎలా ఆపరేట్ చేయాలో తెలిపే మాన్యువల్స్.. కంప్యూటర్ బుక్స్ పంపమని కోరాడు. వీటిని చూసి పీవీ నర్సింహారావు కంప్యూటర్ నేర్చుకున్నారు. ఆరునెలల కాలంలో కంప్యూటర్ పై పూర్తిగా పని చేయడం పీవీకి వచ్చింది. అయితే ఆయన మాములు అవసరాల కోసం కంప్యూటర్ వాడటంతో పాటుగా కోడింగ్.. ప్రొగ్రామింగ్ లాంగ్వేజీలు సైతం నేర్చుకున్నారు.

కోబాల్.. బేసిక్ వంటి లాంగ్వేజీలను నేర్చుకున్నాడు. దీంతోపాటు యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టంలో కోడింగ్ రాయడం సైతం నేర్చుకున్నారు. దీంతో రాజీవ్.. పీవీ కలుసుకున్నప్పుడల్లా టెక్నాలజీ కంప్యూటర్ అప్డేట్ గురించి మాట్లాడుకునే వారని పీవీ కుమారుడు ప్రభాకర్ రావు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సంఘటనతో పీవీ నరసింహారావు కొత్త విషయాలను తెలుసుకునేందుకు ఎంత ఆసక్తి చూపిస్తారో అర్థమవుతోంది. అందుకే ఆయన భారత దేశం గర్వించదగిన నాయకుల్లో ఒకరిగా నిలిచారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.