Begin typing your search above and press return to search.

మాజీ ప్రధానిపై విష ప్రయోగం ... నిజమెంత..?

By:  Tupaki Desk   |   8 Nov 2019 5:37 AM GMT
మాజీ ప్రధానిపై విష ప్రయోగం ... నిజమెంత..?
X
పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌ అరోగ్యంపై పాక్ కి చెందిన కొంతమంది నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. మాజీ ప్రధానిని చంపేందుకు కుట్ర జరిగిందని.. ఆయన శరీరం లో పోలోనియమ్ అనే విషపదార్థాన్ని ఎక్కించారని పాకిస్తాన్‌కు చెందిన ముత్తాహిదా ఖౌమి మూవ్‌మెంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు అల్తాఫ్ హుసేన్ సంచలన ఆరోపణలు చేశాడు. శరీరంలో పోలోనియం జొప్పించిన తర్వాత మార్పుల్లో జరిగే పరిణామాలపై తన ట్విట్టర్‌ లో పోస్ట్ చేశారు.

పోలోనియమ్ శరీరం లోకి ప్రవేశించిన తర్వాత ముందుగా రక్త కణాలను నాశనం చేస్తుందని , ఆ తర్వాత డీఎన్‌ఏ పై దాడి చేసి ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు దారి తీస్తుందని, ఆ తర్వాత లీవర్ , కిడ్నీ, ఎముక గుజ్జులను నిర్వీర్యం చేస్తుందని తెలిపారు. అయితే ఎవరు విష ప్రయోగం చేశారనే విషయాన్ని ఆయన చెప్పలేదు. ఇకపోతే నవాజ్ షరీఫ్ అనారోగ్యం కారణం తో అక్టోబర్‌ 22న లాహోర్‌ లోని సర్వీస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ ఆసుపత్రి లో చేర్పించి చికిత్స అందించారు. మరోవైపు కోర్టు కేసుల్లో విచారణ జరిగిన అనంతరం నవాజ్ షరీఫ్‌ కు ఆక్టోబర్ 29న బెయిల్ మంజూరు చేసింది.

అయితే ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న సమయం లోను పలుమార్లు తీవ్ర ఆనారోగ్యానికి గురి కావడంతో వెంటిలెటర్‌ పై ఉంచి చికిత్స అందించారు. అయితే ఆసుపత్రిలో మెరుగైన చికిత్సా పోందుతున్న నవాజ్ షరీఫ్‌ కు ప్లేట్‌లెట్స్ పడిపోవడంతో చికిత్స అందించారు. ఇక పూర్తి చికిత్స తీసుకోకుండానే ఆయన్ను స్వగృహం ఉమ్రాకు తీసుకువెళ్లారు. దీంతో నివాసంలో వ్యక్తిగత వైద్యుని పర్యవేక్షణ లోనే వైద్యం అందిస్తున్నారు. ఇందుకోసం ఇంట్లోనే ఐసీయూను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.