Begin typing your search above and press return to search.

మాజీ పోర్న్ స్టార్ అరెస్టు.. ఏంచేసిందంటే

By:  Tupaki Desk   |   7 Oct 2021 3:13 PM IST
మాజీ పోర్న్ స్టార్ అరెస్టు.. ఏంచేసిందంటే
X
ఓ మాజీ పోర్న్ స్టార్ అరెస్ట్ అయ్యారు. కన్న కొడుకునే హతమార్చిందన్న ఆరోపణలతో కటకటాల వెనక్కి వెళ్లారు. ఈ ఘటన ఇటలీలో చోటు చేసుకుంది. రక్తపు మరకలతో కనిపిస్తున్న బాలుడిని చేతపట్టుకుని తన కొడుకు అలెక్స్ జుహాజ్‌ను కాపాడండి కాపాడండి అంటూ ఓ సూపర్ మార్కెట్‌లో మాజీ పోర్న్ స్టార్ కటాలిన్ ఎర్జ్‌బెట్ బ్రాడాక్స్ అరుపులు వేశారు. సూపర్ మార్కెట్‌ లోని కస్టమర్లు ఒక్కసారిగా నివ్వెరపోయారు. పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.

పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే బాలుడు మరణించాడు. ఆ సూపర్ మార్కెట్‌కు పక్కనే ఉన్న ఓ భవనంలో అలెక్స్‌కు సంబంధించిన టీషర్ట్ రక్తపుమరకలతో కనిపించింది. అది పోలీసులకు లభ్యమైంది. అలెక్స్ మృతదేహంపై తొమ్మిది కత్తిగాట్లున్నట్టు గుర్తించారు. తల్లి కటాలిన్ పర్స్‌లోనూ కత్తి కనిపించింది. పోలీసులు వెంటనే ఆ కత్తిని స్వాధీనం చేసుకున్నారు.

కటాలిన్ మాజీ భర్త నార్బర్ట్ జుహాజ్ పోలీసులను ఆశ్రయించారు. కటాలిన్ తనతో విడాకులు తీసుకున్నది. అలెక్స్‌తో కలిసి ఇటలీలో జీవిస్తున్నది. కటాలిన్‌తో విడిపోయిన నార్బర్ట్ హంగేరిలో ఉంటున్నారు. తన కొడుకు అలెక్స్‌ను తన మాజీ భార్య కటాలినే హతమార్చి ఉంటుందని ఆరోపించారు. కొడుకు అలెక్స్ కోసం తాను న్యాయ పోరాటం చేస్తున్నారని వివరించారు. తనపై కోపంతోనే కుమారుడు అలెక్స్‌ను చంపేసి ఉండవచ్చునని ఆరోపించారు. ఈ ఫిర్యాదును నమోదుచేసుకున్న పోలీసులు కటాలిన్‌ను అరెస్టు చేశారు.