Begin typing your search above and press return to search.

పట్టుకోండి చుద్దాం! లండన్ ​లో మకాం వేసిన నవాజ్​ షరీఫ్​..అరెస్ట్​ వారెంట్​ జారీ

By:  Tupaki Desk   |   19 Sept 2020 1:20 PM IST
పట్టుకోండి చుద్దాం! లండన్ ​లో మకాం వేసిన నవాజ్​ షరీఫ్​..అరెస్ట్​ వారెంట్​ జారీ
X
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పాకిస్థాన్​ మాజీ ప్రధాని నవాజ్​షరీఫ్​. ఆయన కుమారుడు మర్యమ్​లను ఇస్లామామాద్​ హైకోర్టు దోషిగా తేల్చింది. ప్రస్తుతం వారిమీద అరెస్ట్​ వారెంట్​ కూడా జారీ అయ్యింది. అయితే వారిద్దరూ మాత్రం దర్జాగా లండన్​ లో ఉంటున్నారు. దీంతో నవాజ్​షరీఫ్​ అరెస్ట్​ కు పాకిస్థాన్​ తాజాగా అరెస్ట్​ వారెంట్​ జారీ చేసింది. దీనిపై బ్రిటన్​ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.

నవాజ్​షరీఫ్​ మీద ఉన్న కేసు ఏంటి?
నవాజ్​ షరీఫ్​ మీద పలు అక్రమాస్తుల కేసులు ఉన్నాయి. అయితే 2018లో ఇస్లామాబాద్​ కోర్టు అతడికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. కాగా తాను అనారోగ్యంతో ఉన్నానని.. వైద్యం కోసం లండన్​ వెళ్లాలని లాహోర్​ హైకోర్టులో అర్జీ పెట్టుకున్నారు. దీంతో నాలుగు వారాలపాటు లండన్​ వెళ్లేందుకు గత ఏడాది నవంబర్​ లో హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే నాలుగు వారాలు పూర్తైనా నవాజ్​ షరీఫ్​ పాక్​కు తిరిగి రాలేదు. వైద్యం కోసం మరింత సమయం కావాలని నవాజ్​ తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. దీంతో అతడికి 8 వారాలపాటు గడవు పొడిగించారు. అయినప్పటికీ నవాజ్​ తిరిగి రాలేదు.

మరోవైపు నవాజ్​ దర్జాగా లండన్​లో షాపింగ్​ చేస్తున్నట్టు.. బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్న ఫొటోలు బయటకు వచ్చాయి. దీంతో అతడి పై పలు విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యం లో నవాజ్​ను తమకు అప్పగించాలంటూ ఈ ఏడాది ఆగస్టు లో పాకిస్థాన్​.. బ్రిటన్​ ను కోరింది. నవాజ్ షరీఫ్ అరెస్టు కోసం పంపిన వారెంట్‌ను అందుకున్నట్లు లండన్‌లోని పాక్ హైకమిషన్ కార్యాలయం తెలిపింది. నవాజ్‌ను సెప్టెంబరు 22న ఇస్లామాబాద్ హైకోర్టు ముందు హాజరు పర్చాలని కోర్టు అసిస్టెంట్ రిజిస్ట్రార్ విదేశాంగ శాఖ కార్యదర్శిని ఆదేశించారు. నవాజ్​ పాక్​కు తిరిగొస్తాడా.. మరోసారి కోర్టును ఆశ్రయిస్తారా? అనే విషయం తేలాల్సి ఉంది.