Begin typing your search above and press return to search.

జెసిని ఎంత పద్దతిగా అరెస్ట్ చేసారో తెలిస్తే నోరెళ్లబెడతారు...

By:  Tupaki Desk   |   30 Oct 2019 9:22 AM GMT
జెసిని ఎంత పద్దతిగా అరెస్ట్ చేసారో తెలిస్తే నోరెళ్లబెడతారు...
X
జేసీ దివాకర్ రెడ్డి ..ఈ పేరుకే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఒకే చరిత్ర ఉంది. ఎదుటవుండేది ఎంతటివాడైన కూడా తాను అనుకున్నది అనుకున్నట్టు చెప్పే దమ్మున్న ఏకైక నాయకుడు. జేసీ నోటి వెంట ఏ మాట వచ్చినా అది ఒక సంచలనమే. ఎందుకు అంటే అయన మాట్లాడే ప్రతి మాటకు ఒక పరమార్థం ఉంటుంది. కానీ , మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా జేసీ మాజీగా మిగిలిపోయారు. సాధారణంగా జేసీ గొడవల జోలికి వెళ్లరు కానీ - ఒకసారి దిగితే ఆ సమస్యకి పరిష్కారం దొరకాల్సిందే. ఈ నేపథ్యంలో తమ పార్టీ నేతకి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడానికి వెళ్తున్న జేసీ ని పోలీసులు అరెస్ట్ చేసారు.

అదేంటి జేసీ కనీసం ఎమ్మెల్యే కాదు - ఎంపీ కాదు ఆయన్ని అరెస్ట్ చేయడం ఏమిటి అని అనుకుంటున్నారా ..అదేనండి జేసీ దివాకర్ రెడ్డి పవర్. అరెస్ట్ చేసిన పోలీసులు కూడా జేసీ ని పెళ్ళి కొడుకుని అత్తారింటికి తీసుకుపోయినట్టు చొక్కా నలగకుండా పోలీస్ స్టేషన్ కి తరలించారు. అసలు జేసీ ని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు అబ్బా అని ఆలోచిస్తున్నారా ..దాని వెనుక చాలా పెద్ద కథే ఉంది.

అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం వెంకటాపురం గ్రామంలో కొన్నిరోజులుగా ఒక స్థలం విషయంలో టీడీపీ - వైసీపీ నేతల మధ్య వివాదం జరుగుతుంది. వైఎస్సార్సీపీ కార్యకర్త వెంకట్రామిరెడ్డి తన స్థలం చుట్టూ బండలు పాతడంతో వివాదం తలెత్తింది. ఉద్దేశపూర్వకంగానే టీడీపీ నేత నాగరాజు ఇంటికి వెళ్లే రోడ్డును మూసివేశారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనితో అక్కడికి వెళ్లి నిజాలని తెలుసుకోవడానికి మూడు రోజులుగా టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ , వారిని పోలీసులు ఆ గ్రామంలోకి అడుగుపెట్టనివ్వలేదు. దీనితో నేడు ఏకంగా జేసీ రంగంలోకి దిగి ఆ గ్రామానికి వెళ్లాలని బయలుదేరారు. జేసీ అక్కడికి వెళ్ళడానికి రెడీ కావడం తో ఆయనతో పాటుగా పలువురు టీడీపీ నేతలు కూడా అక్కడికి వెళ్ళడానికి సిద్ధమైయ్యారు.

దీనితో ఇప్పటికే అక్కడ గొడవలు సాగుతున్న నేపథ్యంలో ..జేసీ అక్కడికి వెళ్తే మరిన్ని గొడవలు జరిగే ఆస్కారం ఉందని భావించిన పోలీసులు జేసీ కి నచ్చజెప్పి వెన్కక్కి పంపించాలని చూసారు. కానీ , జేసీ వినకపోవడం తో అరెస్ట్ చేసి ..బుక్కరాయ సముద్రం పోలీస్ స్టేషన్‌ కు తరలించారు. దీనితో పోలీసుల తీరుపై దివాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ అరెస్ట్ తీరును తప్పుడు పడుతూ టీడీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఏరపడ్డాయి.