Begin typing your search above and press return to search.

మాజీ ఎమ్మెల్యే కౌన్సిలర్ గా గెలిచాడు

By:  Tupaki Desk   |   14 March 2021 11:48 AM IST
మాజీ ఎమ్మెల్యే కౌన్సిలర్ గా గెలిచాడు
X
ఒక మాజీ ఎమ్మెల్యే అయ్యిండి.. తన స్థాయికి దిగజారి కౌన్సిలర్ గా పోటీచేశాడు. అయితే ఆ వార్డు ప్రజలు మాత్రం ఆ మాజీ ఎమ్మెల్యేను గెలిపించి ఆయన పరువు కాపాడారు. వైసీపీ పాలనలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల్లో వార్డు కౌన్సిలర్ గా పోటీచేసి విజయం సాధించడం విశేషం.

అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీలో వైసీపీ ఆధిపత్యానికి చెక్ పెట్టడానికి ఏకంగా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో బరిలోకి దిగి ఆశ్చర్యపరిచాడు. తాజాగా వాటి ఫలితాలు వెలువడ్డాయి.

తాడిపత్రి 24వ వార్డులో జేసీ ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. దాదాపు 1200 ఓట్ల మెజార్టీతో జేసీ విజయం సాధించం విశేషం.

మిగతా వార్డుల ఫలితాలపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రెండు వార్డుల్లో వైసీపీ ఏకగ్రీవంగా గెలుపొందింది. కాగా గతంలో తాడిపత్రి మున్సిపాలిటీ చైర్మన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి పనిచేశారు.

అనంతరం టీడీపీ హయాంలో తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీని ముప్పుతిప్పలు పెట్టారు. ఇప్పుడు కౌన్సిలర్ గా బరిలోకి దిగి తాడిపత్రి మున్సిపాలిటీపై పట్టుకోసం ప్రయత్నిస్తున్నారు.