Begin typing your search above and press return to search.
వైసీపీలో వర్గపోరుపై మాజీ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు
By: Tupaki Desk | 2 Oct 2020 9:00 PM ISTవైసీపీ ప్రభుత్వం కొలువుదీరి బాగా పరిపాలిస్తోంది. కానీ పార్టీలో మాత్రం లుకలుకలు బయటపడుతున్నాయి. అధికారయావతో పార్టీలోకి టీడీపీ నేతలు చేరడం.. వారికే ప్రాధాన్యం దక్కుతుండడంతో వైసీపీ కోసం కష్టపడి ఓడిపోయిన నేతల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోందట.. ఈ మేరకు అక్కడో ఇక్కడో వైసీపీ నేతలు బయటపడుతూనే ఉన్నాయి.
తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం వైసీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయని.. కొన్ని రోజులుగా పార్టీలో ఒకరంటే మరొకరికి పడడం లేదన్న వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు గుప్పించడం దుమారం రేపింది.
ఉండి మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు ఘాటు పార్టీలోని కుమ్ములాటలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉండి నియోజకవర్గంలో వైసీపీలో వర్గపోరు ఉందంటూ బాంబు పేల్చారు. ఉండిలో వైసీపీ ఓడిపోవడానికి కారణం ఈ గ్రూపు రాజకీయాలేనని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటికైనా ఉండి నియోజకవర్గంలో నేతలు రాజకీయాలు మానకపోతే తమ లాంటి నాయకులకు ఏం కాదని.. మధ్యలో పోయేది మీరేనంటూ కార్యకర్తలు,నేతలను సర్రాజు హెచ్చరించడం విశేషం. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైసీపీలో చర్చనీయాంశమయ్యాయి.
వైసీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి ఉండిలో వైసీపీ గెలవలేదు. 2009,2014,2019లో వరుసగా టీడీపీనే ఇక్కడ గెలిచింది. అంతకుముందు కాంగ్రెస్ గెలిచింది.2019లో ఉండి వైసీపీ అభ్యర్థిగా నర్సింహారాజు పోటీచేసి టీడీపీ అభ్యర్థి రామరాజుచేతిలో ఓడిపోయారు. ఈ క్రమంలోనే ఉండిలో వైసీపీ బలోపేతం కోసం ప్రయత్నిస్తున్న పార్టీకి అక్కడి మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు కొరుకుడు పడడం లేదట.. ఇప్పుడు ఇదే వైసీపీ పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.