Begin typing your search above and press return to search.
చంద్రబాబు తో మళ్లీ ఒకప్పటి హీరోయిన్ భేటీ
By: Tupaki Desk | 17 Feb 2020 3:45 PM ISTఒకప్పటి తెలుగుదేశం పార్టీ నాయకురాలు, సినీ నటి జయసుధ మళ్లీ చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ నుంచి దూరం కాగా మళ్లీ ఎన్నికల అనంతరం చంద్రబాబును కలిశారు. అయితే ఆమె కలిసిన విషయం రాజకీయంగా కాకుండా వ్యక్తిగత కారణాలతో కలిశారు. తన కుమారుడి వివాహం కోసం చంద్రబాబును ఆహ్వానించడానికి కలిశారు.
మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో సినీనటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. విజయవాడలోని చంద్రబాబు నివాసంలో తన సోదరి సుభాషిణి తో కలిసి జయసుధ వచ్చారు. తన కుమారుడు నిహార్ పెళ్లికి ఆహ్వానం పలుకుతూ పెళ్లి పత్రిక అందించారు. నిహార్ కపూర్ ఢిల్లీకి చెందిన అమ్మాయి అమ్రిత్ కౌర్ ను ఫిబ్రవరి 26వ తేదీన పెళ్లి చేసుకోనున్నట్లు చంద్రబాబు కు వివరించారు. గతంలో ఉన్న అనుబంధంతో చంద్రబాబును ఆమె స్వయంగా ఆహ్వానించారు. ఈ భేటీ వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని, ఆమె గతంలో టీడీపీతో కలిసి పనిచేసిన అనుబంధంతోనే చంద్రబాబుని ఆహ్వానించినట్లు గా తెలిసింది.
జయసుధ కు ఇద్దరు కొడుకులు నిహార్ కపూర్, శ్రియాన్ కపూర్. నిహార్ కపూర్ గతంలో హీరోగా ఓ సినిమా నటించాడు. జయసుధ ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో ఉన్నారు. తన కుమారుడి వివాహానికి త్వరలోనే కేసీఆర్ ను కలిసి ఆహ్వాన పత్రిక అందించే అవకాశం ఉంది.