Begin typing your search above and press return to search.

నాగశౌర్య ఫాంహౌస్ లో మాజీ ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   1 Nov 2021 7:48 AM GMT
నాగశౌర్య ఫాంహౌస్ లో మాజీ ఎమ్మెల్యే
X
హైదరాబాద్ శివారులోని హీరో నాగశౌర్య ఫాంహోస్ లో పేకాట శిబిరంపై పోలీసులు చేసిన మెరుపుదాడిలో సంచలనాలు వెలుగుచూస్తున్నాయి. ఈ వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. లక్షలు కుమ్మరించి పేకాట ఆడుతున్న బడా నేతలు, సెలబ్రెటీలు ఇందులో బుక్కైనట్టుగా చెబుతున్నారు. ఈ కేసులో పోలీసుల విచారణలో హీరో నాగశౌర్య బాబాయ్ పేరు బయటకు వచ్చింది. జూదం నిర్వహిస్తున్న గుత్తా సుమన్ తోపాటు మరికొందరిని పోలీసులు విచారిస్తున్నారు. సుమన్ కు నాగశౌర్యకు సంబంధాలపై విచారణ కొనసాగుతోంది.

మరోవైపు ఈ కేసులో హీరో నాగశౌర్య బాబాయ్ బుజ్జి పేరు తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. బుజ్జి ఈ ఫామ్ హౌస్ ను గుత్తా సుమంత్ అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చినట్టు తెలిసింది. అతడు వారం రోజులుగా అక్కడ క్యాసినో ఆడిస్తున్నాడట.. సుమంత్ కాంటాక్ట్ లిస్ట్ లో ఏపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నారు. ఈ కేసులో నాగశౌర్యకు కాసేపట్లో పోలీసులు నోటీసులు ఇవ్వనున్నట్టు సమాచారం.

నాగశౌర్య ఫామ్ హౌస్ లో పేకాట ఆడుతూ దొరికిన మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శ్రీరాం భద్రయ్యను పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిసింది. అటు పేకాట ఆడిస్తూ దొరికిన గుత్తా సుమన్ పై ఉచ్చు బిగుస్తోంది. అతడి చరిత్ర మొత్తం పోలీసులు బయటకు లాగుతున్నారు.

హైదరాబాద్ లో పలు చోట్ల ఫాంహౌస్ లను అద్దెకు తీసుకొని సుమన్ క్యాసినో ఆడిస్తున్నట్టు గుర్తించారు. సుమన్ ఘరానా కేటుగాడిగా పేరుంది. గారడీ చేసి జనాన్ని ముంచేస్తాడన్న ప్రచారం ఉంది. ఫాంహౌస్ లో పేకాట నాగశౌర్య తండ్రికి తెలిసే జరుగుతుందా? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

నాగశౌర్య తండ్రి పేరు మీద ఈ ఫాంహౌస్ ఉంది. ఆయన బాబాయ్ బుజ్జి పాత్ర కూడా పేకాడలో ప్రచారం సాగుతోంది. ఇదివరకు గుత్తా సుమన్ విజయవాడలోని మామిడితోటల్లో పేకాట శిబిరాలతో పాపులర్ అయ్యాడు. అనంతరం రియల్ ఎస్టేట్ అవతారం ఎత్తాడు.