Begin typing your search above and press return to search.
వివస్త్రను చేసి మత్తుమందిచ్చి అశ్లీల వీడియోలు తీశారు: మాజీ మిస్ ఇండియా
By: Tupaki Desk | 1 Sept 2021 12:00 PM ISTమాజీ వీవీఎన్ మిస్ ఇండియా 2019 విన్నర్ పరీ పశ్వాన్ తాజాగా బాలీవుడ్ లోని ఓ ప్రొడక్షన్ హౌస్ గురించి సంచలన ఆరోపణలు చేశారు. 2019లో వీవీఎన్ మిస్ ఇండియా యూనివర్స్ గా ఎంపికైన తర్వాత యాక్టింగ్ కెరీర్ కోసం ముంబై వచ్చానని.. ఆ సమయంలో నా జీవితంలో ఊహించని సంఘటన చోటుచేసుకున్నదన్నారు. అయితే ఆ ప్రొడక్షన్ హౌస్ లో కొందరు చేసిన నిర్వాకాన్ని బయటపెడితే నా కెరీర్ ను నాశనం చేస్తారని నేను భయపడ్డానని తెలిపారు.కానీ ఇప్పుడు పరిస్థితుల్లో నేను బయటపెట్టక తప్పడం లేదు అంటూ పరీ పాశ్వాన్ సంచలన విషయాలు చెప్పుకొచ్చింది.
ముంబైలోని ఓ ప్రొడక్షన్ హౌజ్ నాకు ఆఫర్ ఇవ్వడంతో సంతోష పడ్డానని.. కానీ షూటింగ్ సమయంలో నా డ్రింకులో మత్తు మందు కలిపి నేను సృహ కోల్పోయేలా చేశారని పరిశీ పాశ్వన్ ఆరోపించింది. ఆ తర్వాత నన్ను వివస్త్రను చేసి అశ్లీల వీడియోలు తీశారని.. ఆ తర్వాత నేను మోసపోయాననే విషయం తెలిసిందని పరీ పాశ్వన్ వాపోయింది. అయితే ఆ ప్రొడక్షన్ సంస్థ వివరాలను మాత్రం బయటకు వెళ్లడించడానికి నిరాకరించింది.
నన్ను మోసగించిన ప్రొడక్షన్ హౌస్ నిర్వాహకులు, నా లైంగిక దాడికి ప్రయత్నించిన వారిపై నేను ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశానని.. ఆ కేసు దర్యాప్తు, విచారణ ఇంకా కొనసాగుతున్నదని పరీ పాశ్వన్ తెలిపారు. ఈ వ్యవహారంలో నా భర్త, ఇతరులపై కాట్రాస్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైందని తెలిపింది.
అమ్మాయిల బలహీనతలను ఆసరాగా చేసుకొని కొంతమంది గ్యాంగ్ గా ఏర్పడి పోర్న్ వీడియోలు షూట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని పరీ పాశ్వన్ తెలిపారు. అలాంటి వ్యవహారంలో నేను బాధితురాలినేనని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నేను దాఖలు చేసిన ఫిర్యాదుపై మల్వానీ పోలీస్ స్టేషన్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని.. ఇలాంటి ముఠాలపై నేను పోరాటం చేస్తున్నానని తెలిపారు. మరొకరు నాలా మోసానికి గురికావద్దని ప్రయత్నిస్తున్నానని పరీ పాశ్వన్ తెలిపారు.
మాజీ మిస్ ఇండియా పరీ పాశ్వాన్ ఇటీవల మరోసారి మీడియాలో హైలెట్ అయ్యారు. వేధింపులు తట్టుకోలేక ఏకంగా భర్తపైనే కేసు నమోదు చేశారు. తనను కట్నం తీసుకురావాలని వేధిస్తున్నాడని.. ఆక్ష్న కుటుంబ సభ్యులు కూడా నాపై దాడికి పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో ఆమె భర్త నీరజ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.