Begin typing your search above and press return to search.

జ‌న‌సేన‌లోకి వ‌ల‌స‌లు.. పుంజ‌కుంటున్న ప‌వ‌న్ పార్టీ!?

By:  Tupaki Desk   |   6 Oct 2021 7:01 AM GMT
జ‌న‌సేన‌లోకి వ‌ల‌స‌లు.. పుంజ‌కుంటున్న ప‌వ‌న్ పార్టీ!?
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన పుంజుకుంటోందా? ఆ పార్టీలో జోరు పెర‌గ‌నుందా? కీల‌క‌మైన నాయ‌కులు.. త్వ‌ర‌లోనే పవ‌న్ చెంత‌కు చేరుకుంటారా? పెద్ద ఎత్తున వ్యూహం సిద్ధం చేసుకుని.. పావులు క‌దుపుతున్నారా? అంటే.. తాజాగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను బ‌ట్టి ఔననే సంకేత‌మే వ‌స్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన అధికారంలోకి వ‌చ్చితీరుతుంద‌ని.. ఇటీవ‌ల కాలంలో ప‌వ‌న్ ప‌దే ప‌దే చెబుతున్న ద‌రిమిలా.. ఆ పార్టీపై అంచ‌నాలు పెరుగుతున్నాయి. ఈ క్ర‌మంలో ఇటు వైసీపీకి, అటు టీడీపీకి.. మ‌రోవైపు బీజేపీకి కూడా త‌ట‌స్థంగా ఉంటున్న నాయ‌కుల‌కు.. ప‌వ‌న్ ఆశావాదంగా క‌నిపిస్తున్న‌ట్టు తేలుతోంది.

ఈ క్ర‌మంలోనే.. మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన గూటికి చేర‌తార‌నే ప్ర‌చారం జోరుగా వినిపిస్తోంది. వాస్త‌వానికి ఆయ‌న ప్ర‌స్తుతం టీడీపీలోనే ఉన్నారు. 2014లో భీమిలి నుంచి గెలిచి.. మంత్రి అయిన త‌ర్వాత‌. గ‌త ఎన్నిక‌ల్లో విశాఖ ఉత్త‌రం నుంచి పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. టీడీపీ అధికారంలోకి రాని ప‌రిస్థితిలో ఆయ‌న అప్ప‌టి నుంచి త‌ట‌స్థంగా మారిపోయారు. పార్టీలో ఉన్న‌ప్ప‌టి కీ.. పార్టీకి సంబంధించిన కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డం లేదు. పైగా.. వైసీపీకి చేరువ అవుతున్నారంటూ.. గ‌త ఏడాది మొదట్లో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది.

కాపు సామాజిక వ‌ర్గంలో బ‌ల‌మైన నాయ‌కుడిగా.. ఎక్క‌డ నుంచి పోటీ చేసినా.. ఎదురులేని విజ‌యం అందుకున్న నాయ‌కుడిగా.. గంటాకు పేరుంది. ప్ర‌స్తుతం ఎమ్మెల్యే అయిన‌ప్ప‌టికీ.. టీడీపీతో అంటీ ముట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇటీవ‌ల చంద్ర‌బాబు నివాసంపై దాడి ఘ‌ట‌న‌కు సంబంధించి అంద‌రూ స‌స్పందించినా.. ఈయ‌న మాత్రం మౌనంగా ఉన్నారు. సో.. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. గంటా.. త్వ‌ర‌లోనే త‌న దారి తాను చూసుకుంటార‌ని అంటున్నారు. అయితే.. వైసీపీలోకి వెళ్లే చాన్స్ క‌నిపించ‌డం లేదు. క్ర‌మంలో గ‌త నుంచి మెగా ఫ్యామిలీకి అనుకూలంగా ఉండ‌డం.. 2009లో ప్ర‌జారాజ్యం పార్టీ త‌ర‌ఫు కూడా విజ‌యం సాధించ‌డం.. వంటివి ప‌రిశీలిస్తే.. జ‌న‌సేన‌లోకి వెళ్ల‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇక‌, బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా జ‌న‌సేన వైపు మొగ్గు చూపుతున్న‌ట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో బీజేపీ మునిగిపోయే ప‌డ‌వ మాదిరిగా ఉండ‌డం. వ్యూహాలు లేక‌పోవ‌డం.. పార్టీలో నిర్వేదం పెరిగిపోతుండ‌డం.. వంటి కార‌ణాల‌తో ఆయ‌న కూడా జ‌న‌సేన వైపు చూస్తున్నార‌నేఏ టాక్ వినిపిస్తోంది. అలాగే.. క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన మాజీ మంత్రి కామినేని శ్రీనివాస‌రావు.. వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల‌కు ముందు...తాను ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటాన‌ని ప్ర‌క‌టించారు. అయితే.. ఇప్ప‌డు మ‌రోసారి ఆయ‌న రాజ‌కీయాల్లోకి రానున్నార‌ని.. వ‌చ్చీ రావ‌డంతోనే జ‌న‌సేన‌లో చేర‌తార‌ని చ‌ర్చ న‌డుస్తోంది.

ఇదిలావుంటే.. వీరు మాత్ర‌మే కాకుండా.. ప‌వ‌న్ క‌నుక‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికార‌మే ధ్యేయంతో ముందుకు సాగితే.. ఇదే త‌ర‌హాలో వ్యూహాత్మ‌కంగా ముందుకు క‌దిలితే.. దాదాపు అన్ని పార్టీల నుంచి వ‌ల‌స‌లు వుంటాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏదేమైనా.. ప‌వ‌న్ వ్యూహాత్మ‌క వైఖ‌రి.. వైసీపీని ఢీ కొట్ట‌గ‌ల‌ననే నిశ్చితాభిప్రాయాన్ని క‌లిగిస్తే.. తిరుగే ఉండ‌ద‌ని చెబుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న ప‌వ‌న్ వైఖ‌రికి.. తాజాగా ఆయ‌న అటు రాజ‌మండ్రి, ఇటు అనంత‌పురం జిల్లాల్లో.. చూపిన వైఖ‌రికి మ‌ధ్య వ్య‌త్యాసం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.


మ‌రోవైపు.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కులాల‌కు దూరంగా ఉన్న జ‌న‌సేనాని ప‌వ‌న్‌..తాజాగా.. సామాజిక స‌మీక‌ర‌ణ‌ల‌కు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగాతన కాపు సామాజిక వ‌ర్గాన్ని గుండుగుత్తుగా .. త‌న‌వైపు తిప్పుకొనే వ్యూహాన్ని ఆయ‌న అమ‌లు చేస్తున్న వైనం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. టీడీపీ, వైసీపీలో తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్న‌ కాపు నాయకులను.. త‌న‌వైపు మ‌ళ్లించుకునేందుకు ప‌వ‌న్ ప్లాన్ చేశారు. ఆ క్రమంలోనే ప‌వ‌న్‌ కులాల చర్చ తెస్తున్నారు. వారిని ఆకర్షించి ఏకం చేద్దామనే ప్రయత్నం జరుగుతోంది. రాజ‌కీయంగా ఏ పార్టీకైనా.. సామాజిక వ‌ర్గాల మ‌ద్ద‌తు, ద‌న్ను.. అత్యంత కీల‌క‌మ‌నే విష‌యం తెలిసిందే. మ‌రి ప‌వ‌న్ వ్యూహం ఏమేర‌కు ఫ‌లిస్తుందో చూడాలి.