Begin typing your search above and press return to search.

సైకిల్ జోరుగా తొక్కేస్తున్న మాజీ మంత్రి ....?

By:  Tupaki Desk   |   11 Feb 2022 10:30 AM GMT
సైకిల్ జోరుగా తొక్కేస్తున్న మాజీ మంత్రి  ....?
X
విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భవిష్యత్తు రాజకీయాల కోసం తనదైన యాక్షన్ ప్లాన్ రెడీ చేసేసుకున్నారు. ఇన్నాళ్ల అయోమయానికి ఆయన అతి పెద్ద ఫుల్ స్టాప్ పెట్టేశారు అనుకోవాలి. ఆయన టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేస్తారు అన్నది నిన్నటిదాకా జరిగిన ప్రచారం అయితే ఇపుడు మాత్రం అదంతా వద్దు రద్దు అనుకుంటున్నట్లుగా భోగట్టా.

ఇక వచ్చే ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశమే జెండా ఎగరవేస్తోంది అని గంటాకు కచ్చితమైన అంచనాలు ఏవో ఉన్నాయని అంటున్నారు. దాంతో గంటా ఇపుడు సైకిల్ జోరుగా తొక్కేస్తున్నారు. ఆయన రెండేళ్లుగా అంటీ ముట్టనట్లుగా ఉన్న విశాఖ నార్త్ నియోజకవర్గంలో గంటా మార్క్ పాలిటిక్స్ ఒక్కసారిగా స్టార్ట్ అయిపోయాయి. అక్కడ గంట గణగణా మోగుతోంది.

గంటా ఇపుడు టీడీపీలో చినబాబుని తెగ కీర్తిస్తున్నారు. రీసెంట్ గా చినబాబు బర్త్ డే వేడుకలను గంటా అంగరంగ వైభవంగా జరిపించేశారు. స్వయంగా ఆయనే కేక్ కట్ చేసి మరీ చినబాబుకు విషెస్ చెప్పారు. మరో వైపు సామాజిక మాధ్యమాల ద్వారా కూడా లోకేష్ ని గ్రీట్ చేశారు. చినబాబు మరిన్ని ఉన్నత పదవులు అందుకోవాలని కూడా ఆయన గట్టిగా కోరుతున్నారు

ఇదంతా చూసిన వారు గంటా లోకేష్ ని ఆకట్టుకోవడానికే ఇదంతా చేస్తున్నారు అంటున్నారు. టీడీపీలో ఇపుడు లోకేష్ అత్యంత కీలకం. ఆయన మాట లేకపోతే ఏ పనీ జరగదు, చంద్రబాబు అధినాయకుడిగా ఉన్నా కూడా లోకేష్ ని కనుక ప్రసన్నం చేసుకోకపోతే అంతా రివర్స్ అవుతుంది. ఈ మధ్యనే గోదావరి జిల్లాలకు చెందిన టీడీపీ పెద్దాయన కూడా వాస్తవాలు గ్రహించి లోకేష్ బర్త్ డే వేళ ఏకంగా సందడి చేశారు. ఇపుడు గంటాదీ అదే దారి అంటున్నారు.

మరి గంటాలో ఇంత మార్పు ఎందుకు వచ్చింది. ఆయన వైసీపీలో చేరే విషయం ఎక్కడ ఆగింది. ఎందుకు బ్రేక్ పడింది అన్న ప్రశ్నలు కూడా వరసగా వస్తున్నాయి. వాటికి జవాబు కూడా ఉంది. గంటా టీడీపీలో చేరడానికి ఒక దశలో చాలా గట్టిగానే ప్రయత్నం చేసిన సంగతి విధితమే. జగన్ సైతం అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కూడా. కానీ విశాఖలో ఉన్న విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాసరావులు అడ్డు తగిలి ఆయన రాకను పూర్తిగా వ్యతిరేకించడంతోనే అది అక్కడితో ఆగిపోయింది అంటారు.

ఇక ఆ మధ్య గంటాకు ఒంట్లో బాగు లేకపోవడంతో బయటకు రాలేదు. ఆ తరువాత ఆయన పూర్తి ఆరోగ్యవంతుడు అయ్యాక మళ్లీ పార్టీ క్యాడర్ ని చేరదీస్తూ వచ్చారు. ఈ సమయంలోనే గంటాలో మార్పు వచ్చింది అంటున్నారు. ఇక గత ఆరు నెలలలోనే ఏపీ రాజకీయాల్లో కీలకమైన్ మార్పులు సంభవించాయని అంటున్నారు.

మునుపు ఉన్న ఊపు వైసీపీలో లేకపోవడం, అదే విధంగా అనేక సమస్యల వలయంలో ప్రభుత్వం వరసగా చిక్కుకుపోవడంతో పాటు అప్పుల కుప్పగా ఏపీ తయారు కావడంతో సర్కార్ కి పెద్ద దెబ్బగా మారింది. ఇక వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిచేందుకు కూడా చాలా అంశాలు అవరోధంగా మారుతాయని గంటా వంటి రాజకీయ మేధావులు అంచనా వేయడం వల్లనే ఒక్కసారిగా ఆయన టర్న్ తీసుకున్నారు అంటున్నారు.

గంటాకు తెలుగుదేశం అధినాయకత్వంతో కొంత గ్యాప్ అయితే ఉంది అని చెబుతారు. ఇపుడు మళ్లీ వాటిని లేకుండా చేసుకోవడానికి గంటా చూస్తున్నారు అని అంటున్నారు. ఇక గంటా బిగ్ షాట్. ఉత్తరాంధ్రా జిల్లాల్లో పార్టీని ఒంటి చేత్తో లేపగలరు. పైగా బలమైన సామాజికవర్గానికి చెందిన నేత. దాంతో ఆయన్ని వదులుకోవడానికి టీడీపీ అసలు సిద్ధపడదు, దాంతో వచ్చే ఎన్నికల్లో మరో మారు టీడీపీలోనే ఉంటూ చక్రం తిప్పడానికి గంటా రెడీ అవుతున్నారు అని తెలుసుతున్న భోగట్టా. ఇక గంటా మార్క్ రాజకీయం కనుక జోరందుకుంటే వైసీపీకి కూడా ఇబ్బందే అంటున్నారు. గంటా సాటి నేత వైసీపీలో ఈ రోజుకీ అక్కడ లేరు అని అంటున్నారు. మొత్తానికి గంటా తాజా అడుగులు టీడీపీకి భారీ ఊరటగానే చూడాలి అంటున్నారు.