Begin typing your search above and press return to search.

రావెల పునరాలోచనలో ఉన్నారా ?

By:  Tupaki Desk   |   9 April 2022 6:32 AM GMT
రావెల పునరాలోచనలో ఉన్నారా ?
X
మాజీమంత్రి రావెల కిషోర్ బాబు పునరాలోచనలో ఉన్నట్లు సమాచారం. ఆయన ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. అయితే ఆ పార్టీలో పెద్దగా ప్రాధాన్యత దక్కటంలేదనే భావనలో ఉన్నారట. అందుకని మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి చేరే విషయం పై రావెల ఆలోచిస్తున్నట్లు సమాచారం.

పైగా బీజేపీ ఎన్ని సంవత్సరాలున్నా రాష్ట్రంలో ఎదుగుదలనేది ఉండదు. గడచిన ఎనిమిదేళ్ళుగా రాష్ట్రప్రయోజనాలను నరేంద్రమోడి సర్కార్ తుంగలో తొక్కేస్తోంది. జనాలందరికీ ఈ విషయం స్పష్టంగా తెలుస్తున్నది.

అయినా వాస్తవాలు మాట్లాడే నేతలు బీజేపీలో ఎవరు కనబడటంలేదు. ఇదే సందర్భంలో బీజేపీలో ఉంటే భవిష్యత్తు ఉండదనేది చాలామంది నేతలకు అర్ధమైపోయిందిత. ఇందులో భాగంగానే రావెలలో కూడా పునరాలోచన మొదలైందని సమాచారం. గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి రావెల 2014లో ప్రాతినిధ్యం వహించారు.ఈ నియోజకవర్గం నుండి వైసీపీ తరపున మేకతోటి సుచరిత గట్టిగా ఉన్నారు.

వచ్చే ఎన్నికల్లో కూడా మేకతోటి పోటీచేయటం ఖాయమే. టీడీపీ-బీజేపీ నుండి ప్రత్తిపాడులో గట్టి అభ్యర్ధులు ప్రస్తుతానికైతే లేరట. బీజేపీ తరపున పోటీ చేయాలంటే రావెలకు టికెట్ ఖాయమే కానీ గెలుపే కష్టం. అందుకనే ఓడిపోయే పార్టీ తరపున పోటీచేయటం దేనికనేది రావెల ఆలోచిస్తున్నారట. అందుకనే ఎలాగూ టీడీపీకి కూడా గట్టి అభ్యర్ధి లేరు కాబట్టి టికెట్ విషయంలో చంద్రబాబునాయుడు నుండి సరైన హామీ దొరికితే వెంటనే టీడీపీలోకి జంప్ చేయటానికి రెడీగా ఉన్నారట.

అయితే ఇప్పటికిప్పుడు టికెట్ హామీఇచ్చి రావెలను పార్టీలోకి తీసుకుంటే పార్టీలోని నేతలు ఎలా రియాక్టవుతారనే విషయాన్ని సీనియర్లు ఆలోచిస్తున్నారట. రాబోయే ఎన్నికలు పార్టీకి చాలా చాలా కీలకమైనది. నియోజకవర్గంలో పట్టున్న నేతైతేనే ఎన్నికల్లో గెలుపు అవకాశాలుంటాయి.

కాబట్టి రావెల ఇప్పటికే ఒకసారి గెలిచి మంత్రిగా కూడా పనిచేసున్నారు కాబట్టి నియోజకవర్గంలో పట్టున్నట్లుగానే బావించాలి. కనీసం మిగిలిన నేతలతో పోలిస్తే రావెలే బెటరనే పరిస్ధితి టీడీపీలో ఉంది. అందుకనే తగిన సంకేతాల కోసం రావెల వెయిట్ చేస్తున్నారట. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.