Begin typing your search above and press return to search.
ఏపీలో మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ముద్రగడ రానున్నారా..?
By: Tupaki Desk | 27 Dec 2021 2:00 PM ISTఆంధ్రప్రదేశ్లో బీసీల రిజర్వేషన్ కోసం ఉద్యమం చేసిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీ అధికారంలోకి వచ్చాక కనిపించలేదు. కేవలం బీసీ ఉద్యమనేతగా పేరు తెచ్చుకున్న ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఇటీవల అసెంబ్లీలో చంద్రబాబు ఇష్యూ అయిన తరువాత మరోసారి మీడియా వెలుగులోకి వచ్చారు.
ఈ వ్యవహారంలో చంద్రబాబుదే తప్పన్నట్లు మట్లాడారు. దీంతో ఆయన వైసీపీ అనుగుణంగా ఉన్నారని అనుకున్నారు. కానీ తాజాగా మరోసారి ముద్రగడ పేరు మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. బీసీల కోసం ఆయన మరోసారి పోరాటంలోకి దిగుతున్నారని ప్రచారం సాగుతోంది. అవసరమైతే బీసీలందరినీ ఐక్యం చేసి కొత్త పార్టీ కూడా పెడుతారా..? అన్న చర్చ జోరుగా సాగుతోది.
ముద్రగడ పద్మనాభం సొంతూరు తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి. ఆదివారం పలువురు బీసీ నేతలు ఆయనతో ఇక్కడ భేటీ అయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన బీసీ నేతలు ఆయనను కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలుగు రాష్ట్రాల కు చెందిన శెట్టి బలిజ కన్వీనర్ కుడిపూడి సూర్యనారాయణ, మాల మహానాడు నేత ఆర్ఎస్ రత్నాకర్ లు కలిసి ముద్రగడతో సమావేశమయ్యారు. వీరంతా బీసీ, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు. కొందరు ఓసీ వర్గానికి చెందిన వారు కూడా ఉన్నట్లు సమాచారం.
ముద్రగడ ఆధ్వర్యంలో మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు యత్నిస్తున్నారా..? అన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఏపీలో ఎన్నికల నిర్వహణకు ఇంకా సమయం ఉన్నా మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకే సమావేశం నిర్వహించినట్లు కొందరు మీడియా ముందు వెల్లడించారు. అయితే ముద్రగడ పద్మనాభం స్వయంగా చెబితే గానీ ఈ సమావేశం అసలు విషయం తెలియదని కొందరు అంటున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే మూడో పార్టీ పెడితే కచ్చితంగా లాభిస్తుందని కొందరు అంటున్నారు.
తెలుగు రాష్ట్రాలో రైతు సమస్యలు తీవ్రమవుతున్నాయి. ఇటీవల రైతులు ధాన్యం నష్టపోకుండా ఉండడానికి ఓ ప్లాన్ చెప్పారు ముద్రగడ. ఓ లేఖ ద్వారా ఇరు రాష్ట్రాలకు తన సూచనలను అందించారు. ధాన్యం వృథా కాకుండా ప్రత్యేక మిషనరీ ఏర్పాటు చేయాలని సూచించారు. అయితే రెండు రాష్ట్రాల సీఎంల నుంచి ఎటువంటి స్పందన లేదు. అయితే బీసీల కోసం ఇదివరకే చేసిన పోరాటంతో ముద్రగడ ప్రత్యేక నాయకుడని పేరు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయ శక్తిగా ప్రజల్లోకి వెళితే ప్రతిఫలాలు ఉండే అవకాశం ఉందని అనుకుంటున్నారు.
గత ప్రభుత్వంలో బీసీలకు అన్యాయం జరిగిందని ఆందోళన నిర్వహించిన విషయం తెలసిందే. ప్రస్తుత ప్రభుత్వంలోనూ కొందరు బీసీ నాయకులకు అవమానాలు జరుగుతున్నాయని భావిస్తున్నారు. మరోవైపు బీసీకి చెందిన నేత అత్యున్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నారు. ఇందులో భాగంగానే ముద్రగడతో సమావేశం అయినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ముద్రగడ పద్మనాభం వైసీపీపై ఎలాంటి కామెంట్లు చేయలేదు. అయితే మూడో ప్రత్యామ్నాయ శక్తి పై ఆయన ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిన అవసరం ఉంది.