Begin typing your search above and press return to search.

మరో మహిళతో భార్యకు అడ్డంగా దొరికిపోయిన మాజీ మంత్రి

By:  Tupaki Desk   |   1 Jun 2022 9:49 AM GMT
మరో మహిళతో భార్యకు అడ్డంగా దొరికిపోయిన మాజీ మంత్రి
X
మాజీ మంత్రి ఆయన.. ఆయన చిలక్కొట్టుడు వ్యవహారాలు మాత్రం తగ్గించలేదు. మహిళలతో వివాహేతర సంబంధాలు ఆపలేదు. ఒకనొక సమయంలో భార్యకు అనుమానం వచ్చి పట్టించడంతో ఈ విషయం వెలుగుచూసింది.

కాంగ్రెస్ పార్టీలో కీలక పదవుల్లో పనిచేసిన నేత మరో యువతితో రెడ్ హ్యాండెడ్ గా దొరకడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తాజాగా గుజరాత్ కాంగ్రెస్ సీనియర్ నేత భరత్ సింగ్ సోలంకీ మరో మహిళతో ఉండగా.. అతడి భార్య వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఈ క్రమంలో భరత్ సింగ్ భార్య.. తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయింది.

మరికొందరితో కలిసి సదురు యువతిపై దాడి చేసింది. సోలంకీ ఆమెను రక్షించే చేసే ప్రయత్నం చేశాడు. అవసరమైతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని భార్యకు సూచించాడు. అయినా ఆమె వినిపించుకోలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

భరత్ సింగ్ కు యువతితో అక్రమ సంబంధం ఉందని అతడి భార్య ఆరోపించింది. ఆమె వల్ల తన తమ వైవాహిక బంధానికి బీటలు వారాయని చెబుతోంది. కాగా భార్యకు, భరత్ సింగ్ కు మధ్య కొన్నాళ్లుగా విభేదాలు ఉన్నట్లు తెలిసింది.

కోర్టులో సోలంకీ భార్య రేష్మా గృహ హింస పిటీషన్ దాఖలు చేశారు. భర్త సోలంకీ తనను ఇంటి నుంచి వెళ్లగొట్టారని రేష్మా ఆఱోపించారు. సోలంకీకి కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా సభ్యురాలితో వివాహేతర సంబంధం ఉందని రేష్మా ఆరోపించింది.