Begin typing your search above and press return to search.

ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో మాజీ మంత్రి సుధీర్ఘ మంతనాలు

By:  Tupaki Desk   |   6 Oct 2021 3:30 PM GMT
ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో మాజీ మంత్రి సుధీర్ఘ మంతనాలు
X
సీఎం కేసీఆర్ ను గతంలో టీడీపీలో ఉండగా బండ బూతులు తిట్టిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ప్రస్తుతం ఏ పార్టీలో లేకుండా ఒంటరిగా ఉంటున్నారు. ఇటీవలే బీజేపీకి గుడ్ బై చెప్పిన బయటకు వచ్చిన మోత్కుపల్లి ప్రస్తుతం కేసీఆర్ ప్రవేశ పెట్టిన 'దళితబంధు' పథకానికి ఆకర్షితుడై టీఆర్ఎస్ లో చేరేందుకు రెడీ అయ్యారు.

టీఆర్ఎస్ లోకి మోత్కుపల్లి నర్సింహులు చేరేందుకు రంగం సిద్ధమైంది. మూడు, నాలుగు రోజుల్లో మోత్కుపల్లి సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.

బీజేపీలో ఉన్న మోత్కుపల్లి కేసీఆర్ దళితబంధుకు ఆకర్షితుడై ఆయన నిర్వహించిన సమావేశానికి హాజరయ్యాడు. బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ కు మద్దతు తెలిపాడు. ఈ క్రమంలోనే గతంలో తిట్టినా కూడా కేసీఆర్ తాజాగా ఆయనతో భేటి అయ్యి టీఆర్ఎస్ లోకి ఆహ్వానించాలని చూస్తున్నట్టు తెలిసింది.

దళితబంధు పథకంపై చర్చ సందర్భంగా మంగళవారం కేసీఆర్ స్వయంగా మోత్కుపల్లిని అసెంబ్లీకి తన వెంట తీసుకొచ్చారు. సాయంత్రం సభలో చర్చ ముగిసే వరకూ మోత్కుపల్లి సీఎం కార్యాలయంలోనే ఉన్నారు. తర్వాత సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ కు తీసుకెళ్లారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. మూడు నాలుగు రోజుల్లో మోత్కుపల్లి గులాబీ కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది. ఆ వెంటనే కీలక పదవి లభించనుందని పేర్కొంటున్నారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకం.. రూపకల్పనతోపాటు కార్యాచరణలో సీఎం, మోత్కుపల్లి భాగస్వామ్యం కల్పించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన దళితబంధుకు సంబంధించిన సభలు, సమావేశాల్లో పాల్గొంటున్నారు.

సీఎం కేసీఆర్ సీఎం అయ్యాక శాసనసభ కమిటీ హాలులో తొలిసారి భోజనం చేశారు. అదీ మోత్కుపల్లితో కలిసి కావడం గమనార్హం. శాసనసభ సమావేశాల సందర్భంగా సభ్యులకు అక్కడ భోజనాల ఏర్పాట్లు ఉంటాయి. అయితేసీఎం, మంత్రులు వారి కార్యాలయాల్లోనే భోజనం చేస్తారు. అయితే కేసీఆర్ మాత్రం నేరుగా కమిటీ హాలుకు వెళ్లి భోజనం చేశారు.