Begin typing your search above and press return to search.
విషాదం: కరోనాతో మాజీ మంత్రి మృతి
By: Tupaki Desk | 1 April 2021 11:13 PM ISTటీడీపీలో మరో విషాదం అలుముకుంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి కరోనాతో మృతి చెందారు. ఈ వార్త తెలిసిన వెంటనే టీడీపీ నేతలంతా విషాదంలో మునిగిపోయారు.ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన మాజీ మంత్రి నడకుదిటి నరసింహారావు కరోనాతో చనిపోయారు.ఇటీవల కరోనా బారినపడిన ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈరోజు పరిస్థితి విషమించి ప్రాణాలు వదిలాడు.
చంద్రబాబు సీఎంగా ఉన్న 1999లో మంత్రిగా నరసింహరావు పనిచేశారు. 2004 ఎన్నికల్లో మచిలీపట్నంలో ఓడిపోయారు.నరసింహారావు మృతిపట్ల టీడీపీ నేతలు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి కృష్ణ జిల్లాలో విషాదం నింపింది.