Begin typing your search above and press return to search.
మాజీ మంత్రి అఖిల ప్రియకు వైద్య పరీక్షలు పూర్తి.. రిపోర్ట్ లో ఏముందంటే?
By: Tupaki Desk | 9 Jan 2021 6:15 PM ISTభూమా అఖిలప్రియ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం చంచల్ గూడా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈమెకి తాజాగా జైలు సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించారు. సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్ పరీక్షలు చేసిన డాక్టర్లు అఖిలప్రియ ఆరోగ్యం బాగుందని రిపోర్ట్ లో పొందుపరిచారు. ఈ రిపోర్టులను అధికారులు సోమవారం న్యాయస్థానానికి అందజేస్తారు. భూమా అఖిల ప్రియ గర్భవతి అని.. ఆమెకు తరచుగా ఫిట్స్ వస్తున్నాయని.. అనారోగ్య కారణాల రీత్యా ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని న్యాయవాదులు సికింద్రాబాద్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
ఈ కారణంతో కోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం అర్ధరాత్రి అఖిల ప్రియను ఉస్మానియా హాస్పిటల్ కు తరలించిన జైలు అధికారులు వైద్య పరీక్షలు చేశారు. సోమవారం బెయిల్ పిటీషన్, కస్టడీ పిటిషన్ కు సంబంధించిన వాదనలు సికింద్రాబాద్ కోర్టులో జరగనున్నాయి. ఇదిలా ఉంటే .. కిడ్నాప్ కేసులో మా అక్కను అనవసరంగా ఇరికించారని భూమా మౌనిక రెడ్డి ఆరోపణలు చేసింది. అఖిల ప్రియే నేరుగా వెళ్లి కిడ్నాప్ చేసినట్లు సృష్టిస్తున్నారన్నారు. అఖిల ప్రియను జైల్లో టెర్రరిస్టు కంటే ఘోరంగా చూస్తున్నారని మౌనికా రెడ్డి ఆరోపించారు. గర్భవతి అయిన ఆమెకు కనీసం వైద్య సాయం కూడా అందడం లేదన్నారు. అఖిల ప్రియకు జైల్లో ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలని మౌనిక డిమాండ్ చేశారు.