Begin typing your search above and press return to search.
భారత్ శరణు కోరిన పాక్ మాజీ ఎమ్మెల్యే!
By: Tupaki Desk | 10 Sept 2019 10:14 AM ISTపాకిస్తాన్.. పక్కా ముస్లిం దేశం.. అక్కడ మైనార్టీలుగా హిందువులు, సిక్కులు ఉన్నారు. దేశంలో ఒకప్పుడు మెజార్టీగా ఉన్న మైనార్టీలు ఇప్పుడు పాక్ జనాభాలో కేవలం 10శాతానికే పరిమితమయ్యారు. ఇప్పుడా సంఖ్య మరింత తగ్గుతోంది. కారణం.. ఆర్టికల్ 370 రద్దు - కశ్మీర్ విభజన తర్వాత మతతత్వ పాకిస్తాన్ ప్రజలు అక్కడి హిందువులు - సిక్కులపై దాడులు చేస్తూ వారిని భయభ్రాంతులకు గురిచేయడమే.. భారత్ పై కోపంతో పాక్ లోని మైనార్టీలను బతకనీయడం లేదని తాజా ఘటనలతో తెలుస్తోంది..
ఇటీవలే సిక్కూ పూజారి కూతురును కిడ్నాప్ చేసి ఓ ముస్లిం వ్యక్తి మతం మార్చి వివాహం చేసుకున్నాడు. ఇక మరో హిందూ బాలికను ముస్లిం వ్యక్తి వివాహం చేసుకున్నాడు. మైనార్టీల అమ్మాయిలను కిడ్నాప్ లు - దాడులు - బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి.
తాజాగా పాకిస్తాన్ లో గెలిచిన సిక్కు మతానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బల్దేవ్ కుమార్ కూడా ఈ దాడులతో బెంబేలెత్తిపోయాడు. తనకు భారత్ రాజకీయ ఆశ్రయం కల్పించాలంటూ భారత్ కు వచ్చేశాడు. పాకిస్తాన్ లో బతకలేమని.. మైనార్టీలపై దాడులు జరుగుతున్నా ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే వాపోయాడు. పాకిస్తాన్ లో మైనార్టీ మతస్థులపై దాడులు ఎక్కువయ్యాయని ఆయన వాపోయారు.
పాకిస్తాన్ లోని రిజర్వ్ సీటు అయిన ఖైబర్ పంక్తుంక్వా జిల్లాలోని బారికోట్ నుంచి ఒకప్పుడు ఎమ్మెల్యేగా బల్దేవ్ కుమార్ గెలిచాడు. అక్కడ గెలిచిన ఎమ్మెల్యే హత్యకు గురికావడంతో రెండో స్థానంలో ఉన్న బల్దేవ్ ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఎమ్మెల్యేను బల్దేవ్ చంపాడని పోలీసులు జైల్లో వేశారు. రెండేళ్ల తర్వాత నిర్ధోషిగా కోర్టు ఆదేశాలతో బల్దేవ్ విడుదలయ్యాడు. అప్పటికే కాలపరిమితి అయిపోయింది. కేవలం రెండు రోజులు మాత్రమే ఎమ్మెల్యేగా బల్దేవ్ కొనసాగారు. ఇటీవల కాలంలో పాక్ లో హిందువులు, సిక్కులపై దాడులు పెరిగిపోవడంతో తన కుటుంబాన్ని భారత్ లోని లుథియానాలో ఉన్న తమ బంధువుల ఇంటికి పంపించారు.
బల్దేవ్ కూడా ఆగస్టు12న భారత్ కు మూడు నెలల వీసాపై వచ్చి ఇక పాకిస్తాన్ లో బతకలేమని.. తనకు భారత్ ఆశ్రయం కల్పించాలని వేడుకుంటున్నారు. ఈ మేరకు కేంద్రానికి దరఖాస్తు కూడా చేశాడు. పాకిస్తాన్ లో మైనార్టీలను అత్యంత ఘోరంగా పీడిస్తున్నారని వాపోయాడు. భారత్ కు వీసాపై వచ్చిన తనకు ఆశ్రయం కల్పించాలని కేంద్రాన్ని వేడుకున్నాడు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ లోని హిందువులు - సిక్కులపై దాడులు మరింత పెరిగాయని.. అక్కడ బతకలేకపోతున్నామని బల్దేవ్ చెప్పుకొచ్చారు.