Begin typing your search above and press return to search.

సిద్దూ ‘పెద్దన్న’ వ్యాఖ్యలకు మాజీ క్రికెటర్ గంభీర్ ఘాటు కౌంటర్

By:  Tupaki Desk   |   21 Nov 2021 1:30 PM GMT
సిద్దూ ‘పెద్దన్న’ వ్యాఖ్యలకు మాజీ క్రికెటర్ గంభీర్ ఘాటు కౌంటర్
X
భావోద్వేగాలతో ఓట్లు దండుకోవాలన్న పేరాశతో.. కొత్త తిప్పల్ని తెచ్చి పెట్టుకుంటున్నారు పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోతి సింగ్ సిద్ధూ. తాజాగా పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ను తన పెద్దన్నగా ఆయన అభివర్ణించిన వ్యాఖ్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు.. తిట్ల దండకాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. ఎంత ఎన్నికలు దగ్గరకు వస్తే మాత్రం.. పాక్ అధ్యక్షుడ్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై సామాన్యుడి మొదలు సెలబ్రిటీల వరకు మండిపాటు వ్యక్తమవుతోంది. ఇక.. రాజకీయ రగడ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు.

పాక్ లోని కర్తారా్ పూర్ కారిడార్ లో పర్యటించిన సందర్భంలో సిద్ధూ మాట్లాడుతూ.. ఇమ్రాన్ ఖాన్ ను తన పెద్దన్నగా సంబోధించారు. సిద్ధూ పర్యటనలో పాక్ అధికారులు ప్రధానమంత్రి తరఫున స్వాగతం పలుకుతున్నట్లుగా చెప్పగా.. ఆయన తన పెద్దన్నగా సిద్ధూ అభివర్ణించారు. దీనికి సంబంధించిన వీడియోను బీజేపీ సోషల్ మీడియా విభాగపు చీఫ్ అమిత్ మాల్వియా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాహుల్ ను ఇష్టపడే సిద్ధూ.. పాక్ ప్రధాని ఇమ్రాన్ ను పెద్దన్న అంటున్నారని.. గతంలో పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ భాజ్వాను ఆలింగనం చేసుకొని ప్రశంసలతో ముంచెత్తటాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ తీరును పలువురు తప్పు పడుతున్నారు. ఇదిలా ఉంటే..ఈ ఉదంతం మీద బీజేపీ ఎంపీ కమ్ మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ రియాక్టు అయ్యారు. సిద్ధూ వ్యాఖ్యలపై ఘాటుగా రియాక్టు అయ్యారు.

ఇమ్రాన్ ను పెద్దన్నగా వ్యాఖ్యానించటానికి ముందు.. సిద్ధూ తన ఇద్దరు పిల్లల్ని బోర్డర్ కు పంపాలని డిమాండ్ చేశారు. పాక్ అండదండలతో చెలరేగుతున్న ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ 70 ఏళ్లుగా పోరాడుతోందని.. దానికి సహకరిస్తున్న దేశాధినేతను పట్టుకొని పెద్దన్నగా అభివర్ణించటం సిగ్గుచేటుగా వ్యాఖ్యానించారు. ‘నీ కొడుకును కానీ కుమార్తెను కానీ సరిహద్దు వద్దకు పంపిన తర్వాతే ఉగ్రవాదానికి సహకరిస్తున్న ఆ దేశాధినేతను పెద్దన్న అని పిలుచుకోవాలన్నారు.

పంజాబ్ నుంచి పాకిస్థాన్ కు 21 కిలోమీటర్ల దూరం ఉన్నప్పుడు 2100 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన అవసరం ఏమిటని సిద్ధూ ప్రశ్నిస్తూ.. ఆ క్రమంలో ఇమ్రాన్ ఖాన్ తన పెద్దన్నగా ఆయన పేర్కొన్నారు. దీంతో.. సిద్ధూ చేసిన వ్యాఖ్యల్ని పలువురు తీవ్రంగా తప్పుపడుతున్నారు. మరి.. గంభీర్ వ్యాఖ్యలపై సిద్దూ ఎలా రియాక్టు అవుతారో చూడాలి.