Begin typing your search above and press return to search.

బంగ్లా మ్యాచ్ లో కోహ్లీ చేసింది ఫేక్ ఫీల్డింగే.. తేల్చేసిన భారత మాజీ క్రికెటర్

By:  Tupaki Desk   |   5 Nov 2022 4:12 AM GMT
బంగ్లా మ్యాచ్ లో కోహ్లీ చేసింది ఫేక్ ఫీల్డింగే.. తేల్చేసిన భారత మాజీ క్రికెటర్
X
టీ20 వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియాకు చెందిన విరాట్ కోహ్లీ వ్యవహరించిన తీరు క్రీడా ప్రపంచాన్ని ఇప్పుడు ఊపేస్తుండటం తెలిసిందే. అతగాడు నిబంధనలకు విరుద్ధంగా.. తొండి ఫీల్డింగ్ చేసినట్లుగా బంగ్లాదేశ్ క్రికెటర్లు ఆరోపిస్తున్న వైనం తెలిసిందే.

దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ.. టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. కోహ్లీ మీద వచ్చిన ఫేక్ ఫీల్డింగ్ నూటికి నూరు శాతం నిజమని చెప్పటమే కాదు.. అంపైర్లు ఈ విషయాన్ని గమనించటంలో జరిగిన పొరపాటుతో కోహ్లీ బతికి పోయారన్నారు.

ఒకవేళ.. అంపైర్లు కానీ కోహ్లీ తీరును గుర్తించి ఉంటే.. అదనంగా ఐదు పరుగులు ఇచ్చేవారని.. అదే జరిగితే బంగ్లాదేశ్ భారత్ జట్టు మీద గెలిచి ఉండేదన్న అతడి వ్యాఖ్యలు ఇప్పుడు షాకింగ్ గా మారాయి. ఉత్కంఠ భరితంగా సాగిన బంగ్లా మ్యాచ్ లో కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ పై ఆకాశ్ చోప్రా ఏమన్నారన్నది చూస్తే.. కోహ్లీ నూటికి నూరుశాతం ఫేక్ ఫీల్డింగ్ చేశారని అభిప్రాయపడ్డారు.

"ఫేక్ పీల్డింగ్ వేళ కోహ్లీ చేతిలో బంతి లేకున్నా.. నాన్ స్ట్రైకర్ వైపు త్రో చేసినట్లుగా నటించాడు. అతడు చేసిన పనిని గ్రౌండ్ లో ఉన్న ఆంఫైర్లు గమనించి ఉంటే భారత్ కు ఐదు పరుగులు పెనాల్టీ విధించేవారు.

అదే జరిగి ఉంటే.. టీమిండియా ఐదు పరుగుల తేడా గెలిచేది" అని వ్యాఖ్యానించారు. ఐదు పరుగుల తేడాతోనే మ్యాచ్ ను బంగ్లాదేశ్ చేజార్చుకోవటం తెలిసిందే.

అయితే.. మ్యాచ్ సందర్భంగా ఆ విషయాన్ని ఎవరూ గమనించలేదు కాబట్టి ఇప్పుడు చేయటానికి ఏమీ లేదని తేల్చారు. ఇప్పటివరకు బంగ్లా ఆటగాళ్ల ఆరోపణల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ.. అకాశ్ చోప్రా మాటలతో కోహ్లీ చేసింది ఫేక్ ఫీల్డింగ్ అన్న మాటకు బలం చేకూరినట్లుగా చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.