Begin typing your search above and press return to search.
ఎట్టకేలకు పదో తరగతి పాస్ అయిన మాజీ సీఎం
By: Tupaki Desk | 5 Sept 2021 10:23 AM ISTరాజకీయానికి చదువుకు సంబంధం లేదు. అక్షరం ముక్క రాకున్నా ప్రజల్లో పేరు పలుకుబడి ఉన్న వాళ్లు రాజకీయ నాయకులుగా ఎదగవచ్చు. రాజకీయాల్లోకి వచ్చేందుకు ఉద్యోగాలలాగ కనీస అర్హత లేకపోవడంతో నేతలకు ఆడింది ఆట పాడింది పాట అయిపోయింది. రాజకీయాల్లోనూ విద్యార్హత పెట్టాలన్న డిమాండ్ నిరుద్యోగుల నుంచి వ్యక్తమవుతోంది.
తాజాగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి.. ఇన్నాళ్లు ప్రభుత్వాన్ని నడిపించిన ఆ నాయకుడు 86 ఏళ్ల వయసులో పదోతరగతి పాసయ్యాడు. ఎట్టకేలకు హమ్మాయ్య అంటూ సర్టిఫికెట్ సాధించారు. ఒక్క సబ్జెక్ట్ తో ఆయన పదోతరగతి అర్థాంతరంగా ఆపేసిన మాజీ సీఎం ఇప్పుడు ఆ సబ్జెక్ట్ లో పాసవ్వడం విశేషం. తాజాగా శనివారం విడుదలైన పరీక్ష ఫలితాల్లో మాజీ సీఎం పాస్ కావడం విశేషం.
హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా ఇటీవల 12వ తరగతి పాసయ్యాడు. అయితే ఆయన పదోతరగతి పాస్ కాకపోవడంతో ఆ ఉత్తీర్ణతను నిలిపివేశారు. ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో పదోతరగతి ఫెయిల్ కావడంతో ఆయన చదువు ఆగిపోయింది. ఇటీవల జరిగిన పరీక్షల్లో చౌతాలా ఇంగ్లీష్ పరీక్ష రాశాడు. తాజాగా హర్యానా విద్యాబోర్డు విడుదల చేసిన పరీక్షా ఫలితాల్లో ఆయన ఇంగ్లీష్ 100కు 88 మార్కులు సాధించి పదోతరగతి గండాన్ని ఎట్టకేలకు గట్టెక్కాడు.
కరోనా తొలి దశలో ఓపెన్ స్కూలులో చౌతాలా ఇంటర్మీడియెట్ లో చేరాడు. అయితే పదోతరగతి పూర్తి చేయకుండానే ఇంటర్ కు ఉత్తీర్ణత అవ్వడం కుదరకపోవడంతో అధికారులు ఫలితాన్ని నిలిపివేశారు.
ఇప్పుడు ఓం ప్రకాష్ చౌతాలా పదోరగతి పాసవడంతో ఇంటర్ కూడా ఉత్తీర్ణత సాధించాడు. లేటు వయసులో లేటెస్ట్ గా పదోతరగతి ఇంటర్మీడియెట్ ఉత్తర్ణత సాధించడం విశేషం.