Begin typing your search above and press return to search.

డ్రగ్ కేసులోని బుక్ అయిన ఆమెకు మాజీ సీఎం ఫోన్?

By:  Tupaki Desk   |   4 Oct 2020 5:15 AM GMT
డ్రగ్ కేసులోని బుక్ అయిన ఆమెకు మాజీ సీఎం ఫోన్?
X
మీడియాలో పెద్దగా ఫోకస్ కావటం లేదు కానీ.. బాలీవుడ్ డ్రగ్స్ కేసుతో పోలిస్తే.. శాండల్ వుడ్ లో బయటకు వచ్చిన డ్రగ్స్ దందా బయటకు పొక్కటమే కాదు.. సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఇద్దరు ప్రముఖ నటీమణులు అరెస్టు కావటంతో పాటు.. పలువురు సెలబ్రిటీలు సైతం తిప్పలు తప్పలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా డ్రగ్స్ ఉదంతంలో కన్నడ టీవీ యాంకర్ అనుశ్రీని అరెస్టు చేసే అవకాశం ఉందంటున్నారు.

ఇదిలా ఉంటే.. డ్రగ్స్ సరఫరాలో తనెలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ.. అనుశ్రీ తాజాగా ఒక చిట్టి వీడియోను షేర్ చేశారు. అయితే.. ఈ వీడియో సందేశం మొత్తం పెద్ద నాటకంగా పలువురు కొట్టిపారేస్తున్నారు. ఇదిలా ఉంటే.. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఈ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

డ్రగ్స్ కేసులో సంబంధం ఉన్న నటి అనుశ్రీని ఒక మాజీ ముఖ్యమంత్రి కాపాడుతున్నట్లుగా ఆయన ఆరోపించారు. ఆమెను రక్షిస్తున్న ఆ మాజీ సీఎం ఎవరో తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. తాజాగా అనుశ్రీకి ఒక మాజీ సీఎం ఫోన్ చేసినట్లుగా వార్తలు వెల్లువెత్తున్నాయి. ప్రస్తుతం కర్ణాటకలో మొత్తం నలుగురు మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు. వారిలో ఎవరు తనుశ్రీకి ఫోన్ చేయటంతో పాటు.. ఆమె ముద్రల్ని తుడిచేసేలా ప్రయత్నిస్తున్నారన్నది ప్రశ్నగా మారింది. ఈ వ్యవహారంలో సదరు మాజీ సీఎం పేరు బయటకు వస్తే మాత్రం.. ఆయన ఇమేజ్ భారీగా దెబ్బ తినటం ఖాయమంటున్నారు.