Begin typing your search above and press return to search.

'తెన్నేటి' రోజులు కావు.. 'త‌న్నేటి' రోజులు జేడీ స‌ర్‌..!

By:  Tupaki Desk   |   27 Dec 2022 1:30 AM GMT
తెన్నేటి రోజులు కావు.. త‌న్నేటి రోజులు జేడీ స‌ర్‌..!
X
సీబీఐ మాజీ జాయింట్ డైరెక్ట‌ర్‌(జేడీ) వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ ఆద‌ర్శాలు మంచివే. ఆయ‌న అడుగులు దేశానికి, రాష్ట్రానికి కూడా అవ‌స‌ర‌మే. కానీ, నేటి రోజులు అలా ఉన్నాయా? అనేది ప్ర‌శ్న‌. ఎందుకంటే.. నీకేం ఇచ్చాను.. అనేది పోయి.. నాకేం ఇస్తావు.. అనే రోజులు రాజ‌కీయాల్లో ఎక్కువ‌గా సాగుతున్నాయి. ఏదో ఒక విధంగా ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పుచ్చో.. మాయ‌చేసో.. వారిలో ర‌క్తాన్ని సెంటిమెంటు మంట‌ల‌తో ర‌గిలించో.. త‌మ‌వైపు తిప్పుకొనే ప్ర‌బుద్ధులు పాల‌కులు.. దేశాధినేత‌లుగా ఉన్న రోజుల్లో జేడీ నీతులు.. నేతిబీర‌కాయ‌నే త‌ల‌పిస్తాయ‌నేది మేధావుల మాట‌.

అయితే.. అంత మాత్రాన ఆయ‌న పంథామార్చుకుని.. ముందుకు సాగాల‌ని కూడా ఎవ‌రూ కోరుకోవ‌డం లేదు.కానీ, ఇదో జాగ‌రూక‌త‌.. ఇదో హెచ్చ‌రిక‌. ప్ర‌జ‌ల‌కు ఏంచేయాలో తెలుసు. కానీ, ఎలా చేయాల‌తో తెలియ‌దు నేటి రాజ‌కీయ నేత‌ల‌కు. కావాల్సింది ఓట్లు త‌ప్ప‌.. మ‌రో రాజ‌కీయం ఏపీలో లేనేలేదు. అయితే.. జేడీ మాత్రం తాను ఒంట‌రిగా పోటీ చేస్తాన‌ని.. త‌న కుమార్తెను కూడా రంగంలోకి దింపుతాన‌ని ఆయ‌న చెబుతున్నారు. దీనిని మేధావులు స్వాగ‌తిస్తున్నారు. స్వాగ‌తిస్తారు కూడా!

అయితే, ఆయ‌న ఎంచుకున్న అభ్య‌ద‌య వాదం.. మాత్రం నేటి రోజుల్లో లేద‌నేది వీరి మాట‌. ''మీరు స్వతంత్రంగా పోటీ చేస్తాన‌ని అంటున్నారు. రూపాయి కూడా ప్ర‌జ‌ల‌కు ఇవ్వ‌న‌ని చెబుతున్నారు. కానీ, గెలుస్తారా?'' అని అడిగిన ప్ర‌శ్న‌కుజేడీ చెప్పిన స‌మాధానం ''తెన్నేటి విశ్వ‌నాథం వంటివారు స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేసి విశాఖ నుంచే గెలిచారు.

సోనేనే కూడా గెలుస్తా!! '' అని ధీమా వ్య‌క్తం చేశారు. కానీ, ఇప్పుడు అస‌లు అదే విశాఖ‌లో తెన్నేటి విశ్వ‌నాధం ఎవ‌రు? ఆయ‌న ఏం చేశారు? అస‌లు ఆయ‌న‌కు రాజ‌కీయాల‌కు సంబంధం ఏంటి? అని జేడీ రుషి కొండ‌పై నిల‌బ‌డి స‌మాజాన్ని ప్ర‌శ్నిస్తే.. ఒక‌రిద్ద‌రు త‌ప్ప ఆయ‌న‌కు చెప్పేవారు లేరు.

ఇదీ మ‌న రాజ‌కీయం. తెన్నేటి రోజులు ఇప్పుడు లేవు. రావు కూడా! ఇప్పుడున్న‌వ‌న్నీ.. త‌న్నేటి రోజులు. ప్ర‌జ‌లు నాయకు ల‌ను, నాయ‌కులు ప్ర‌జ‌ల‌ను త‌న్నుకునే రోజులు వ‌స్తున్నాయి. అభ్యుద‌య భావాలు నిజానికి స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుల కాలంలోనే అడుగంటాయ‌నేది.. డాక్ట‌ర్ అంబేడ్క‌ర్‌ను ఓడించిన రోజునే ఈ దేశంలో నిరూపిత‌మైపోయింది.

కులాలు, మ‌తాలు.. డ‌బ్బులు, దౌర్జ‌న్యాలు చోటు చేసుకుని.. వాటితోనో రాజ‌కీయాలు కాపురం చేస్తున్న స‌మ‌యంలో జ‌యప్ర‌కాశ్ నారాయ‌ణ్‌(లోక్‌స‌త్తా), జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ వంటివారి ప్ర‌జ‌లు ఆద‌రిస్తే.. ఆమోదిస్తే.. మంచిదే.. అలా జ‌ర‌గాల‌నే కోరుకుందాం. కానీ, రోజులు అయితే అలా లేవు స‌ర్‌!!


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.