Begin typing your search above and press return to search.
బ్రెట్ లీ పక్కనే ఉన్నా.. డీన్ జోన్స్ ను సేవ్ చేయలేకపోయాడట
By: Tupaki Desk | 25 Sept 2020 10:15 AM ISTఆసీస్ క్రికెట్ దిగ్గజం డీన్ జోన్స్ ముంబయిలో మరణించిన వైనం తెలిసిందే. అంతటి క్రికెట్ ప్రముఖుడు హోటల్ లాబీల్లో మాట్లాడుతూనే కుప్పకూలిపోవటం.. ఆయన్ను ఆసుపత్రికి తరలించే సమయానికి మరణించిన వైనం అందరిని కలిచి వేస్తోంది. ఐపీఎల్ టోర్నీ లో కామెంట్రీ చెప్పేందుకు ఆయన భారత్ కు వచ్చారు. ఇందుకు సంబంధించిన పనులు చేస్తున్నప్పుడు ఆయనకు గుండెపోటు వచ్చింది. మరింత పెద్ద మనిషికి సడన్ గా అనారోగ్యానికి గురైనప్పుడు ఆయన పక్కన ఎవరూ లేరా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
డీన్ జోన్స్ కు గుండె పోటు వచ్చే సమయానికి.. ఆయన పక్కనే మరో ప్రముఖ క్రికెటర్.. ఆసీస్ మాజీ పేసర్ బ్రెట్ లీ ఉన్నారట. కాన్ఫరెన్సు ముగించుకొని ముచ్చట్లు ఆడుకుంటూ హోటల్ లాబీల్లోనే ఉన్నారట.ఆ సమయంలోనే తీవ్రమైన గుండెపోటుకు గురయ్యారట. దీంతో.. వెంటనే స్పందించిన బ్రెట్ లీ.. ఆయనకు సీపీఆర్ (కార్డియాక్ పల్మనరీ రిససిటేషన్) చేశారట.
అనుకోని రీతిలో గుండెపోటుకు గురైన వారికి శ్వాసను పునరుద్ధరించే ప్రక్రియను చేపట్టారు. ఇంత చేసినా ఆయన్ను కాపాడుకో లేక పోయినట్లుగా బ్రెట్ లీ వాపోతున్నాడు. తన పక్కనే తన స్నేహితుడు అనారోగ్యానికి గురి కావటం.. ప్రమాదాన్ని గుర్తించి.. దాన్ని నిరోధించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించ లేదన్న ఆవేదన ఆయన మాటల్లో వినిపిస్తోంది. ఊహించని రీతిలో చోటు చేసుకున్న ఈ పరిణామం క్రికెట్ ప్రేమికుల్ని కలిచివేస్తోంది.