Begin typing your search above and press return to search.

ఆ విషయంలో మాత్రం మెస్సీని దాటేసిన రొనాల్డో ...

By:  Tupaki Desk   |   23 Sep 2021 5:50 AM GMT
ఆ విషయంలో మాత్రం మెస్సీని దాటేసిన రొనాల్డో  ...
X
ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న లెజెండరీ ఫుట్‌బాల్ క్రీడాకారులు లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో. ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య ఎప్పుడూ హోరాహోరీ పోటీ జరుగుతూనే ఉంటుంది. ఆట వరకూ పోటీదారులుగా ఉండే ఈ ఇద్దరూ, బయట మంచి స్నేహితులు కూడా. రొనాల్డో, మెస్సీ ఇద్దరిలో ఎవరు టాప్... అంటే చెప్పడం కష్టం.కొందరు మెస్సీయే టాప్ అంటే, మరికొందరు రొనాల్డోనే తోపు అంటారు.

2021-22 సీజన్‌ కి గాను ప్రపంచంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న క్రీడాకారుల జాబితాను ఫోర్బ్స్‌ సంస్థ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో పోర్చుగల్‌ స్టార్‌ ఫుట్‌బాలర్‌ క్రిస్టియానో రొనాల్డొ అత్యధికంగా ఏడాదికి 922 కోట్లు(125 మిలియన్‌ డాలర్లు) అర్జిస్తూ అగ్రస్థానంలో లో నిలిచాడు. ఇటీవలే జువెంటస్‌ క్లబ్‌ ను వదిలి మాంచెస్టర్‌ యునైటెడ్‌కు బదిలీ అయిన సీఆర్‌7.. అర్జెంటీనా స్టార్‌ ఫుట్‌బాలర్‌ లియోనల్‌ మెస్సీ(811 కోట్లు)ని రెండో స్థానానికి నెట్టి టాప్‌ ప్లేస్‌కు చేరుకున్నాడు.

జీతభత్యాల ద్వారా 70 మిలియన్‌ డాలర్లు పొందే రొనాల్డొ, కమర్షియల్‌ డీల్స్‌ రూపేనా మరో 55 మిలియన్‌ డాలర్లు జేబులో వేసుకుంటున్నాడు. మరోవైపు రొనాల్డొ సమవుజ్జీ అయిన మెస్సీ, జీతం ద్వారా 75 మిలియన్‌ డాలర్లు, ఇతర ఎండార్స్‌మెంట్ల రూపేనా మరో 35 మిలియన్‌ డాలర్లు అర్జిస్తున్నాడు. ఈ జాబితాలో వీరిద్దరి తర్వాతి స్థానాల్లో బ్రెజిల్‌ స్టార్‌ ఫుట్‌ బాలర్‌ నెయ్‌ మార్‌(95 మిలియన్‌ డాలర్లు), టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌(90 మిలియన్‌ డాలర్లు), ప్రొఫెషనల్‌ బాస్కెట్‌ బాల్‌ ప్లేయర్‌ లెబ్రాన్‌ జేమ్స్‌ (65 మిలియన్‌ డాలర్లు), ప్రముఖ గోల్ఫ్‌ క్రీడాకారుడు టైగర్‌ వుడ్స్‌(70 మిలియన్‌ డాలర్లు) ఉన్నారు.