Begin typing your search above and press return to search.
ఫోర్బ్స్ భారతీయ సంపన్నుల జాబితా : నెంబర్ 1 లో అంబానీ , నెంబర్ 4 లో డిమార్ట్ అధినేత దమానీ
By: Tupaki Desk | 9 Oct 2020 4:00 PM ISTపారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మరోసారి దేశీయంగా అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్నారు. సుమారు 8,870 కోట్ల డాలర్ల (దాదాపు రూ. 6,56,000 కోట్లు) సంపదతో ఫోర్బ్స్ ఇండియా 2020 కుబేరుల లిస్టులో వరుసగా పదమూడోసారీ నంబర్ వన్‌గా నిల్చారు. గౌతమ్ అదానీ, శివ్ నాడార్ ఆ తర్వాత స్థానాలు దక్కించుకున్నారు. వంద మంది సంపన్నుల జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారిలో దివీస్ ల్యాబ్స్ ఎండీ మురళి దివి, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ప్రమోటర్ల కుటుంబం, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ చైర్మన్ పీపీ రెడ్డి , అరబిందో ఫార్మా సహ వ్యవస్థాపకుడు పీవీ రామ్‌ప్రసాద్ రెడ్డి ఉన్నారు. కరోనా వైరస్ మహమ్మారి భారత్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపినప్పటికీ టాప్ 100 సంపన్నుల్లో సగం మంది సంపద గణనీయంగానే పెరిగిందని ఫోర్బ్స్ వెల్లడించింది.
ఇక , టాప్ 10 జాబితాలో డిమార్ట్ అధినేత రాధాకృష్ణన్ దమానీ 15.4 బిలియన్ డాలర్లతో టాప్ 4వ ర్యాంకులో నిలిచారు. ఆ తర్వాత కొత్తగా సీరం ఇన్సిట్యూట్ అధినేతసైరస్ పూనవల్లా టాప్ 10 ర్యాంకులో చోటు దక్కించుకున్నారు. 11.5 బిలియన్ డాలర్ల నికర ఆధాయంతో
సైరస్ పూనవల్లా టాప్ 5 ర్యాంకులో ఉన్నారు. ఫోర్బ్స్ భారతీయ కుబేరుల జాబితాలో అంబానీ నుంచి లక్ష్మీ మిట్టల్ వరకు ఎంతమంది టాప్ 10 ర్యాంకుల్లో తమ సంపాదనతో చోటు దక్కించుకున్నారో ఇప్పుడు చూద్దాం..
టాప్ -10 భారతీయ ధనవంతులు:
ముఖేష్ అంబానీ: 88.7 బిలియన్ డాలర్లు
గౌతమ్ అదానీ: 25.2 బిలియన్ డాలర్లు
శివ నాదర్: 20.4 బిలియన్ డాలర్లు
రాధాకిషన్ దమాని: 15.4 బిలియన్ డాలర్లు
హిందూజా సోదరులు: 12.8 బిలియన్ డాలర్లు
సైరస్ పూనవల్లా: 11.5 బిలియన్ డాలర్లు
పల్లోంజి మిస్త్రీ: 11.4 బిలియన్ డాలర్లు
ఉదయ్ కోటక్: 11.3 బిలియన్ డాలర్లు
గోద్రేజ్ కుటుంబం: 11 బిలియన్ డాలర్లు
లక్ష్మి మిట్టల్: 10.3 బిలియన్ డాలర్లు