Begin typing your search above and press return to search.
ఎవరి కోసం ఇజ్రాయెల్ అన్ని దాడులు చేసిందో.. అతడు బయటకొచ్చాడు
By: Tupaki Desk | 23 May 2021 12:00 PM ISTఒక వ్యక్తి చుట్టూ రెండు దేశాల మధ్య జరిగిన పోరు.. తమ అధిక్యతను ప్రదర్శించటమే కాదు.. తమ సత్తా చాటేందుకు మానవ హననానికి.. భారీ ఆస్తి నష్టానికి వెనుకాడకుండా తన ఆయుధ శక్తి సామర్థ్యాల్ని ప్రదర్శించింది ఇజ్రాయెల్. హమస్ అగ్రనేత యాహియా సిన్వర్ లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ పదకొండు రోజుల పాటు తీవ్ర దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ - హమస్ మధ్య సాగిన దాడులు అమెరికా అధ్యక్షుడు బైడెన్ జోక్యంతో కాల్పుల విరమణ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.
ఎవరినైతే లక్ష్యంగా చేసుకొని ఇంత భారీగా ఇజ్రాయెల్ దాడులు జరిపిందో.. హమస్ అగ్రనేత యాహియా సిన్వర్ బయటకు వచ్చారు. దాదాపుగా మూడు వారాలకు పైనే బయట కనిపించని ఆయన.. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మరణించిన ఒక కమాండర్ కు నివాళులు అర్పించేందుకు.. కమాండర్ కుటుంబీకులకు తన సంతాపాన్నితెలియజేసేందుకు ఆయన బయటకు వచ్చారు. గాజా వీధుల్లో నడుచుకుంటూ ఆయన కమాండర్ ఇంటికి వెళ్లారు. ఏ వ్యక్తి కోసమైతే ఇజ్రాయెల్ ఇంత రచ్చ చేసిందో.. ఆ వ్యక్తి తాజాగా వీధుల్లోకి రావటం చర్చనీయాంశంగా మారింది.