Begin typing your search above and press return to search.

అమెరికాలో మొదటిసారిగా...మెగా టీటీ ఈవెంట్

By:  Tupaki Desk   |   15 April 2021 5:00 PM IST
అమెరికాలో మొదటిసారిగా...మెగా టీటీ  ఈవెంట్
X
దక్షిణ కొరియాలో జరగాల్సిన ప్రపంచ టేబుల్‍ టెన్నిస్‍ (టీటీ) చాంపియన్‍షిప్‍ కరోనా కరోనా వైరస్‍ కారణంగా రద్దయింది. అయితే ఈ ఏడాది ఈ మెగా ఈవెంట్‍ ను నిర్వహిస్తామని అంతర్జాతీయ టేబుల్‍ టెన్నిస్‍ సమాఖ్య (ఐటీటీఎఫ్‍) ప్రకటించింది. అమెరికాలోని హ్యూస్టన్‍ నగరం ఈ ఏడాది నవంబర్‍ 23 నుంచి 29 వరకు ప్రపంచ టీటీ చాంపియన్‍షిప్‍ పోటీలకు వేదికగా నిలుస్తుందని ఐటీటీఎఫ్‍ వెల్లడించింది.

1937లో అమెరికా ఏకైకసారి పురుషుల టీమ్‍ ఈవెంట్‍ లో స్వర్ణ పతకం సాధించింది. ఆ తర్వాత అమెరికా మూడు కాంస్యాలు (1938, 1948, 1949), ఒక రజతం (1947) దక్కించుకుంది. 1949 తర్వాత అమెరికాలో మరోసారి టీమ్‍ చాంపియన్‍ షిప్‍ లో పతకాన్ని సాధించలేదు. 95 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రపంచ టీటీ చాంపియన్‍ షిప్‍ పోటీలు అమెరికాలో జరగనుండటం ఇదే ప్రథమం. అమెరికాలోని హ్యూస్టన్‌ నగరం ఈ ఏడాది నవంబర్‌ 23 నుంచి 29 వరకు ప్రపంచ టీటీ చాంపియన్‌ షిప్‌ పోటీలకు వేదికగా నిలుస్తుందని ఐటీటీఎఫ్‌ వెల్లడించింది. కాగా, 95 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రపంచ టీటీ చాంపియన్‌షిప్‌ పోటీలు అమెరికాలో జరగనుండటం ఇదే ప్రథమం. 1949 తర్వాత అమెరికా మరోసారి టీమ్‌ చాంపియన్‌షిప్‌లో పతకాన్ని సాధించలేకపోయింది.