Begin typing your search above and press return to search.

మొబైల్ యాడ్స్ కోసం రూ. 16,800 కోట్లు !

By:  Tupaki Desk   |   12 April 2021 11:41 AM GMT
మొబైల్ యాడ్స్ కోసం రూ. 16,800 కోట్లు !
X
స్మార్ట్ ఫోన్స్ .. ప్రస్తుత జీవితంలో ఓ భాగంగా మారిపోయింది. మన జీవితంలో కుటుంబం ఎంత ముఖ్యమో స్మార్ట్ ఫోన్ కూడా అంతే ముఖ్యమైంది. మరికొందరు కుటుంబానికంటే తమ ఫోన్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దాన్ని ఓ వస్తువులా చూడటం ఎప్పుడో మరచిపోయి , జీవితంలో భాగం , అది లేకపోతే మనం అన్నంతగా మారిపోయారు. ఇక ఇంటర్నెట్ కనెక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. ఉదయం లేవగానే ఆ ఇన్ స్టాగ్రామ్ , పేస్ బుక్ , వాట్సప్ చూడకపోతే మైండ్ అసలు పనిచేయదు. ఇక స్మార్ట్ ఫోన్స్ తో పాటుగా మనుషులకి కావాల్సిన అనేకరకాలైన యాప్స్ ను పలు కంపెనీలు తయారుచేస్తున్నాయి.

ఇకపోతే , స్మార్ట్ ఫోన్స్ వినియోగదారులని ఆకట్టుకోవడానికి మొబైల్ యాప్స్ తయారు చేసే కంపెనీలు మార్కెటింగ్ పై ప్రత్యేక దృష్టిని పెట్టి , కోట్లు పెట్టి భారీ లెవెల్ లో మార్కెటింగ్ చేస్తున్నారు. యాప్ అనలిటిక్స్ సంస్థ యాప్ .. ప్రకారం, 2019 సంవత్సరానికి మొబైల్ ప్రకటనల కోసం రూ .16,800 కోట్లు (240 బిలియన్ డాలర్లు) ఖర్చు చేశారు. ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు 2021 మొదటి మూడు నెలల్లో రోజుకు 4.2 గంటలు ఫోన్స్ తోనే గడిపారు. 2019 తో పోలిస్తే ఇది 30 శాతం పెరిగింది. 2019 మార్చి తో పోలిస్తే , ఈ ఏడాది మార్చి లో భారత్ లో 80 మంది ఎక్కువగా స్మార్ట్ ఫోన్స్ ను వినియోగిస్తున్నారట.

ఏదేమైనా 2020 లో గ్లోబల్ అడ్వర్టైజింగ్ మార్కెట్ 4.2 శాతం తగ్గిపోయింది. దీనికి ప్రధాన కారణం కరోనా వైరస్. కరోనా ప్రభావం ఏ ఒక్క పరిశ్రమకో పరిమితం కాలేదు. ప్రతి పరిశ్రమ మహమ్మారి కారణంగా తీవ్ర నష్టాలని చవిచూసింది. అయితే , అదే సంవత్సరంలో డిజిటల్ ప్రకటనలు మాత్రం 8 శాతం పెరిగాయి. లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లకు అంటుకోవడంతో, డేటా మరియు ఇంటర్నెట్ కోసం డిమాండ్ కొంతమేర పెరిగింది. ఇదిలా ఉంటే , ఈ ఏడాది మొబైల్ , యాప్స్ ప్రకటనల కోసం భారీగా ఖర్చు పెట్టాలని ఆ రంగం కసరత్తులు చేస్తుంది. దాదాపుగా ఈ ఏడాది 290 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టాలని అనుకుంటున్నారట.