Begin typing your search above and press return to search.
చిన్నారులకు... జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్
By: Tupaki Desk | 27 Dec 2021 5:04 PM ISTటీనేజర్ల వాక్సినేషన్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 15 నుంచి 18 ఏళ్ల మధ్య ఉండే వారికి టీకాలు ఉచితంగా ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే ఇందుకు సంబంధించిన ప్రక్రియకు తాజాగా తెరలేపింది. కొవిన్ యాప్ ద్వారా 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు ఉండే టీనేజర్లు వారి పేర్లను టీకా కొరకు నమోదు చేసుకోవాలని తెలిపింది. ఈ ప్రక్రియ జనవరి ఒకటి నుంచి ప్రారంభమవుతుందని కేంద్రం స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే టీనేజర్లకు టీకా ఇవ్వాలని ఇటీవల జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
యువతకు టీకా పంపిణీ కార్యక్రమం జనవరి 3 నుంచి ప్రారంభం అవుతుందని తన ప్రసంగంలో ప్రధాని తెలిపారు. అయితే ఇందుకు అనుగుణంగా జనవరి ఒకటో తేదీ నుంచి రిజిస్ట్రేషన్ లో ప్రారంభమవుతాయని కొవిన్ యాప్ చీఫ్ ఓ సమావేశంలో తెలిపారు. టీకా తీసుకోవాలని అనుకున్న వారు గతంలోనే ద్వారా ముందస్తుగా బుక్ చేసుకోవాలి. ఇలా బుక్ చేసుకున్న తర్వాత వారికి ఇవ్వబడిన స్లాట్ ప్రకారం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించి ఆయన కొన్ని సూచనలు చేశారు. టీకా తీసుకునే వారు ముందుగా వారి పేరును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
సాధారణంగా వ్యాక్సినేషన్ నమోదు ప్రక్రియలో ప్రత్యేకించి ఆధార్ కార్డు జోడించాల్సి ఉంటుంది. అయితే టీనేజర్లకు ఇచ్చే వ్యాక్సిన్ కు సంబంధించి ప్రభుత్వం ఒకింత మినహాయింపు ఇచ్చింది. వ్యాక్సినేషన్ కోసం 15 నుంచి 18 ఏళ్ల మధ్య గల వారు తమ పేరును నమోదు చేసుకోవాల్సి ఉంటే కచ్చితంగా ఆధార్ కార్డుతో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. వారు చదివే ఏదైనా స్కూల్లో లేదా కాలేజీకి సంబంధించి ఐడి కార్డు పొందుపరిస్తే సరిపోతుందని అధికారులు తెలిపారు.
టీనేజ్ వాళ్లకు ఇచ్చే టీకా జనవరి మూడో తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు ప్రణాళికలు చేస్తున్నాయి. నిర్దేశించిన వయసు ఉండేవారు ఎక్కువ మంది స్కూల్స్ కాలేజీలో చదివే వారే ఉంటారని భావిస్తున్నా ప్రభుత్వం... టీకా పంపిణీ కార్యక్రమాలను ఏకంగా విద్యాసంస్థల్లో నే చేపట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు విజయవంతంగా 100% వ్యాక్సినేషన్ ను పూర్తి చేశాయి. మిగతా రాష్ట్రాలు కూడా అదే బాటలో నడుస్తున్నాయని కేంద్రం పేర్కొంది. కొత్తగా పిల్లలకు ఇచ్చే టీకాకు ఆమోదముద్ర వేసిన కేంద్రం... వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని భావిస్తోంది.
మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. కేవలం ఒక్క ఢిల్లీలోనే అరవై మూడు కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 574 చేరాయి కొత్త వేరియంట్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని పలు రాష్ట్రాల ప్రభుత్వాలు రాత్రిపూట విధించాయి.