Begin typing your search above and press return to search.
కరోనా పై మోడీ వరుస కీలక భేటీలు !
By: Tupaki Desk | 19 April 2021 5:00 PM ISTదేశంలో కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకి మరింత తీవ్రత పెంచుకుంటూ పోతుంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి కేంద్రం తగు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ప్రధాని మోదీ సోమవారం సాయంత్రం 4:30 గం.లకు మోదీ ప్రముఖ వైద్యులతో సమావేశం నిర్వహించదలిచారు. సెకండ్ వేవ్ కట్టడికి ఇంకా ఏఏ మార్గాలు, పద్ధతులు అనుసరించాలన్న విషయాన్ని ఆ వైద్యుల నుండి అడిగి తెలుసుకోనున్నట్లు సమాచారం. వైద్యులతో భేటీ ముగిసిన తర్వాత సాయంత్రం 6 గంటలకు ఫార్మా కంపెనీలతో సమావేశం కానున్నారు. దేశంలో రెమిడేసివిర్ కొరతతో పాటు తదితర అంశాలు కూడా వీరిమధ్య చర్చకు రానున్నాయని సమాచారం.
ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇందులో వ్యాక్సినేషన్ ప్రక్రియ, కరోనా కట్టడిపైనే ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశం ముగియగానే వైద్యులు, ఫార్మా ప్రముఖులతో భేటీ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కరోనా వైరస్ కట్టడి, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంపై ఆయన అధికారులతో చర్చిస్తున్నారు. దేశంలో రెండో దఫా కరోనా విజృంభణ మొదలైనప్పటి నుంచి ప్రధాని ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించడం ఇది రెండోసారి.గతకొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో 2లక్షల 73వేల కేసులు వెలుగుచూశాయి. మరో 1600మంది కొవిడ్ రోగులు మృత్యువాత పడ్డారు. కొవిడ్ విలయంతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న చాలా రాష్ట్రాల ఆసుపత్రులు రోగులతో నిండిపోతుండడంతో పలుచోట్ల దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో మెడికల్ ఆక్సిజన్ కొరత, రెమ్‌డిసివిర్ ఔషధంతో పాటు వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉందని పలు రాష్ట్రాలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి విన్నవించాయి. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని రాష్ట్రాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోడీ కీలక భేటీ నిర్వహించదలిచారు.