Begin typing your search above and press return to search.
ఈఎంఐ వాయిదాకు ఓకే చేస్తే.. మూల్యం ఎంత భారీనంటే?
By: Tupaki Desk | 8 April 2020 6:00 AM ISTకరోనా కష్టకాలంలో నెలసరిగా చెల్లించాల్సిన బ్యాంకు వాయిదాల్ని చెల్లించకుండా కేంద్రం ప్రకటించిన మారిటోరియం వాడాలనుకుంటున్నారా? మూడు నెలల వాయిదాను కట్టకూడదని ఇప్పటికే డిసైడ్ అయ్యారా? కష్ట కాలంలో ఉన్నప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయానికి మురిసిపోతే.. వారుచెప్పినట్లే ఫాలో అవ్వాలనుకుంటున్నారా? జరా జాగ్రత్త. కరోనా పుణ్యమా అని మూడు నెలల మారిటోరియంను వినియోగిస్తే.. భారం ఎంత భారీగా ఉంటుందో తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే.
ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు తమ వినియోగదారులకు పంపిన వాయిదా చెల్లింపు లెక్కల్ని చూస్తే.. మారిటోరియం కరోనా కష్టానికి మందుబిళ్ల ఎంతమాత్రం కాదు.. చాలా ఖరీదైన చాక్లెట్ లాంటిది. ఈఎంఐ చెల్లింపు విషయంలో మూడు నెలల రిలాక్స్ కు ఓకే అంటే.. దాని మూల్యం ఎంత భారీగా ఉంటుందో తెలిస్తే హడలిపోవాల్సిందే. వీలైతే ఎవరో ఒకరి దగ్గర అప్పు తీసుకొచ్చి వాయిదా మొత్తాన్ని చెల్లిస్తే మంచిదన్న భావన కలగటం ఖాయం. ఎందుకిలా అంటే..?
ఉదాహరణ కు మీరు తీసుకున్న రుణం(ఏదో ఒకటి. ప్రభుత్వ గైడ్ లైన్స్ లో ఉన్న వాటికి సంబంధించి అయితే చాలు) మీద నెలసరి వాయిదా నెలకు రూ.17,041 చొప్పున చెల్లిస్తున్నారునుకుందాం. ప్రభుత్వం చెప్పినట్లుగా మూడు నెలల మారిటోరియానికి ఒకే అని చెప్పేశామనే అనుకుందాం. మీరు తీసుకున్న రుణాన్ని మూడేళ్లలో (అంటే 36నెలల్లో) తీర్చే ఒప్పందం ఉంటే.. మీరు అదనంగా చెల్లించే వడ్డీ ఎంతో తెలుసా? అక్షరాల రూ.12,816. అదే ఐదేళ్ల లో (అదేనండి 60 నెలల్లో) తీర్చే ప్లాన్ మీద ఉన్నారునుకుందాం.
మూడు నెలలు చెల్లించకుండా ఉంటే.. తర్వాతి కాలంలో రీపే చేద్దామని అనుకున్నారనుకోండి. మీరు చెల్లించే అదనపు వడ్డీ ఎంతో తెలుసా? అక్షరాల రూ.21,240. అదే పదేళ్లు (120 నెలల ప్లాన్ లో ఉంటే) మీరు గడువు పూర్తి అయ్యేసరికి రూ.42,360 చెల్లించాలి. అదే పదిహేను సంవత్సరాల ప్లాన్ (180 నెలలు) ఉంటే మీరు అదనంగా చెల్లించే వడ్డీ మొత్తం రూ.63,360. అదే పాతికేళ్లకు ఈఎంఐ చెల్లించేలా బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంటే.. గడువు తర్వాత మరో మూడునెలలు ఈఎంఐ కట్టటమే కాదు.. ఈ మొత్తానికి అదనంగా చెల్లించే వడ్డీ మొత్తం తెలుసా? రూ.84,480. ఇప్పుడు అర్థమైందా? మూడు నెలల మారిటోరియానికి చెల్లించే మూల్యం ఎంత భారీగా ఉందో? రూ.18వేల ఈఎంఐకి వడ్డీ రూ.84వేలు అంటే మామూలు విషయమా?