Begin typing your search above and press return to search.

కొత్త రూల్స్; విదేశాల నుంచి వస్తున్నారా?

By:  Tupaki Desk   |   20 Aug 2015 4:59 AM GMT
కొత్త రూల్స్; విదేశాల నుంచి వస్తున్నారా?
X
విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు సంబంధించి సరికొత్త కస్టమ్స్ నిబంధనల్ని ఆర్థిక శాఖ వెల్లడించింది. ఇలాంటి అంశాల విషయంలో జాగ్రత్తలు తీసుకోకుంటే లేనిపోని ఇబ్బందులు ఖాయం. ఇక.. తాజాగా వచ్చిన నిబంధనల్ని చూస్తే..

= ఇప్పటివరకూ విదేశాల నుంచి వచ్చే వారు రూ.10వేల మొత్తానికి సంబంధించిన స్వదేశీ కరెన్సీని తెచ్చే వెసులుబాటు ఉంది. ఇకపై ఆ మొత్తం రూ.25వేలకు పెరగనుంది.

= తమ వద్దనున్న స్వదేశీ కరెన్సీ రూ.25వేలకు మించి ఉంటే..ఆ విషయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది.

= ఇక కస్టమ్స్ పత్రంలోనూ మార్పులు చేసేశారు.

= మారిన విధానాల ప్రకారం విదేశాల నుంచి వచ్చే వారు తమ వెంట.. ఎల్ సీడీ.. ఎల్ ఈడీ..ప్లాస్మా టీవీలను తీసుకొచ్చిన పక్షంలో తెలియజేయాలి.

= మాంసం.. మాంసం ఉత్పత్తులు.. డెయిరీ పదార్థాలు.. మొక్కలకు సంబంధించిన వివరాల్ని వెల్లడించాలి.

= విదేశీ నోట్ల విలువ రూ.6.52లక్షలకు మించి ఉంటే పన్ను చెల్లింపు కోసం రెడ్ ఛానల్ విభాగాన్ని సంప్రదించాల్సి ఉంటుంది.

= పన్ను మినహాయింపులు అనుమతించే సిగిరెట్లు.. ఇతర పొగాకు ఉత్పత్తులపై 50 శాతం కోత విధింపు.

= సిగిరెట్ చుట్టలు 25.. పొగాకును 150 గ్రామాలకు.. 100 సిగిరెట్లకు పరిమితం చేశారు. గతంలో ఇది రెట్టింపు పరిమితితో అనుమతించేవారు.