Begin typing your search above and press return to search.

ట్రంప్ కు వరంగా.. బైడెన్ కు దిమ్మ తిరిగేలా షాకిచ్చిన ఫ్లోరిడా

By:  Tupaki Desk   |   4 Nov 2020 3:40 PM IST
ట్రంప్ కు వరంగా.. బైడెన్ కు దిమ్మ తిరిగేలా షాకిచ్చిన ఫ్లోరిడా
X
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ.. మన ఎన్నికల ప్రక్రియకు పూర్తి భిన్నం. ఇక్కడి నిబంధనలు కొన్ని అయితే చాలా సిత్రంగా అనిపిస్తాయి కూడా. విలక్షణంగా ఉండే అమెరికా ఎన్నికల విధానాన్ని కాసేపు పక్కన పెడితే.. ఈ ఎన్నికల్లో విజయం సాధించటానికి పెద్ద రాష్ట్రాలు..కీలకమైన కొన్ని స్టేట్లలో అధిక్యత తప్పనిసరి. అలాంటి రాష్ట్రాల్లో ఒకటి ఫ్లోరిడా. ఈ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్ గెలుపు ఖాయమన్న మాట వినిపించింది.

అందుకు భిన్నంగా తాజా ఫలితం ఉండటం షాకింగ్ గా మారింది. తాజాగా వెలువడుతున్న పలితాల్నిచూస్తే.. ట్రంప్ వర్గీయుల్లో ఆనందం రెట్టింపు అయితే.. జో బెడైన్ వర్గీయులకు మాత్రం దిమ్మ తిరిగే షాకింగ్ గా మారిందంటున్నారు. దీనికి కారణం.. ఫ్లోరిడా మీద వారు పెట్టుకున్న అంచనాలే కారణంగా చెప్పాలి. అధ్యక్ష పీఠాన్ని దగ్గర చేయటంలో కీలక భూమిక పోషించే రాష్ట్రాల్లో ఫ్లోరిడా ఒకటి. ఇక్కడి ప్రజల తీర్పు అధ్యక్ష ఎన్నికల్లో కీలకమని చెబుతారు. ఇక్కడ జో బైడెన్ గెలుపు తథ్యమని భావించారు.

అందుకు భిన్నంగా.. తాజాగా వెలువుడుతున్న ఫలితాలు ట్రంప్ కు అనుకూలంగా ఉండటం గమనార్హం. తొలుత ఇక్కడ స్వల్ప అధిక్యతలో ఉన్న ట్రంప్.. నెమ్మదిగా తన బలాన్ని పెంచుకుంటూ పోవటం విశేషం. ఇప్పటివరకు వెలువుడిన పలితాల ప్రకారం చూస్తే.. ఫ్లోరిడా రాష్ట్రం ట్రంప్ వశమయ్యే అవకాశం ఉందంటున్నారు. తమకు అనుకూలంగా వస్తున్న ఫలితాన్ని చూస్తున్న రిపబ్లికన్లు.. ఫ్లోరిడాను తమ ఖాతాలో వేసేసుకోవటం గమనార్హం. తుది ఫలితం రాక ముందే.. ప్లోరిడాలో తమ విజయం సంపూర్ణమని చెబుతున్నారు. అంతే కాదు.. కీలక రాష్ట్రాలుగా చెప్పే జార్జియా.. ఒహైయో.. టెక్సాస్ లోనూ ట్రంప్ అధిక్యతను ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది.

ఎన్నో ఆశలు పెట్టుకున్న ఫ్లోరిడా బైడెన్ వర్గానికి నిరాశను మిగిల్చగా.. యూటా.. అరిజోనా.. నెవడాలో మాత్రం అధిక్యతను ప్రదర్శిస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన ఎలక్టోరల్ కాలేజీ ఓట్లలో బైడెన్ కు 209 వస్తే.. ట్రంప్ మాత్రం 118 ఓట్లు సాధించారు. ఇప్పటివరకు 45 రాష్ట్రాల్లో పోలింగ్ ముగియగా.. మరో ఐదు రాష్ట్రాల్లో కొనసాగుతోంది.