Begin typing your search above and press return to search.

జలప్రళయం.. 300 మీటర్ల లోతులో చిక్కుకున్న కార్మికుడి అనుభవం ఇదీ

By:  Tupaki Desk   |   9 Feb 2021 4:20 PM IST
జలప్రళయం.. 300 మీటర్ల లోతులో చిక్కుకున్న కార్మికుడి అనుభవం ఇదీ
X
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వరద మ్రుతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మంచు కరిగి వచ్చిన వరదల కారణంగా ఇప్పటికే అనేక మంది గల్లంతైన విషయం తెలిసిందే. వీరిలో సోమవారం రాత్రి వరకు 26 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 171 మంది కోసం గాలిస్తున్నట్లు డీజీపీ అశోక్ కుమార ప్రకటించారు. తపోవన్లోని 250 మీటర్ల టన్నెల్లో సుమారు 30 మంది కార్మికుల చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. వీరిని కాపాడేందుకు సహాయక బృదాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లాలో నందాదేవి పర్వతం ఒక్కసారి కరిగిపోయింది. దీంతో పెద్ద ఎత్తున వరద ప్రవాహం మొదలైంది. ఈ ప్రవాహంతో తపోవన్-రేణిలో ఎన్టీపీసీ నిర్మిస్తున్న 31.2 మెగావాట్ల రిషిగంగ విద్యుత్ ప్రాజెక్టు పూర్తిగా ధ్వంసమైంది. అలాగే విష్ణుగడ్ ప్రాజెక్టు కూడా పూర్తిగా దెబ్బతింది. ఈ ప్రాజెక్టులో పనిచేస్తున్న వందలాంది మంది గల్లంతయ్యారు. తొలుత గల్లంతైనవారు 203 గా అధికారులు ప్రకటించారు. ఆ తరువాత గల్లంతైన వారి సంఖ్య పెరుగుతోంది.

ఈ సందర్భంగా డీజీపీ ట్విట్టర్ లో వివరాలను పెట్టారు. 'గత రాత్రి 8 గంటల వరకు 26 మృతదేహాలను వెలికి తీశారు. 171 మంది ఆచూకీ ఇంకా రాలేదు. అందులో 35 మంది టన్నెల్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అయినా సహాయక చర్యలను ఆపలేదు. ఇంకా కొనసాగిస్తున్నాం.' అని వెల్లడించారు.

కాగా ఇప్పటి వరకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సంయుక్తంగా 27 మందిని కాపాడారు. విష్ణుగడ్ ప్రాజెక్టు వద్ద 12 మందిని, రిషి గంగా ప్రాంతంలోని టన్నెల్ లో 15 మందిని కాపాడారు. ఈ సందర్భంగా వరదలో చిక్కుకుని బయటకు వచ్చిన ఓ కార్మికుడు తన అనుభవం చెప్పాడు. 'తాము టన్నెల్లో పనిచేస్తుండగా ఒక్కసారిగా వరదనీరు వచ్చింది. టన్నెల్ 300 మీటర్ల లోపల తామున్నామని, ఇందులోకి నీరు చేరడంతో పైన ఉన్న సలాకలు పట్టుకొని ఉన్నామన్నారు. అయితే క్రమంగా నీరు తగ్గడంతో తామూ ఊపిరి పీల్చుకున్నామన్నారు.

తపోవన్లోని మరో 30 మంది కార్మికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వీరికి కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక వరదల కారణంగా పరివాహక గ్రామాలు కొన్ని కొట్టుకుపోగా మరికొన్ని పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో అనేక మంది నిరాశ్రయులయ్యారు. ఈ మేరకరు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ అండగా ఉంటామని ధైర్యం చెబుతున్నారు.