Begin typing your search above and press return to search.

మునుగోడులో డబ్బు వరద ?

By:  Tupaki Desk   |   20 Aug 2022 8:30 AM GMT
మునుగోడులో డబ్బు వరద ?
X
హుజూరాబాద్ ఉపఎన్నికలో ఏరులై పారిన డబ్బుకట్టల గురించి జనాలు మరచిపోకముందే మునుగోడులో కూడా అదేవిధంగా మొదలైంది. సర్పంచ్ నుండి జడ్పీటీసీల వరకు లక్షల రూపాయలను ఎరేస్తున్నారు.

ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీయే ఇలాంటి డబ్బు రాజకీయాలకు ముందుగా తెరెత్తటం విచిత్రంగా ఉంది. అందులోను విచిత్రం ఏమిటంటే తమ పార్టీకి చెందిన స్దానికి సంస్ధల ప్రజాప్రతినిధులకే డబ్బులు భారీగా ముట్టచెబుతోందట.

ఇంతకీ విషయం ఏమిటంటే మునుగోడు ఉపఎన్నికలో అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకరరెడ్డిని పోటీచేయించాలని కేసీయార్ డిసైడ్ అయ్యారు. అధికారికంగా ప్రకటించలేదు కానీ దాదాపు ఖాయమైపోయింది. అయితే మొదటి నుండి కూసుకుంట్లను చాలామంది స్థానిక నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయినా వీరి వ్యతిరేకతను కేసీయార్ ఏమాత్రం లెక్కచేయటం లేదు. దాంతో మండిపోయిన నేతలు వెంటనే పార్టీ మారిపోవటానికి డిసైడ్ అయ్యారు.

చండూరు మండలానికి చెందిన ఐదుగురు స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ లో నుంచి బీజేపీలోకి జంప్ చేసేశారు. ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీ కండువాలు కప్పుకున్నారు. 21వ తేదీన చౌటుప్పల్లో జరగబోయే బహిరంగ సభలో మాజీ ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డితో పాటు టీఆర్ఎస్ కు చెందిన చాలామంది ప్రజాప్రతినిధులు బీజేపీలో చేరబోతున్నట్లు ప్రచారం మొదలైంది. దాంతో అలర్టయిన టీఆర్ఎస్ నాయకత్వం ఈ విషయమై దృష్టిపెట్టారు. ప్రజాప్రతినిధులను కొంతమందిని కలిసి బుధ, గురువారాల్లో తలా 3 లక్షల రూపాయలను చేతిలోపెట్టారట.

టీఆర్ఎస్ లో నుండి వెళ్ళిపోతారని అనుకుంటున్న ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులపై పార్టీ యంత్రాంగం నిఘా పెట్టింది. చండూరు మండలంలోని టీఆర్ఎస్ కు 15 మంది సర్పంచులు, నలుగురు ఎంపీటీసీలున్నారు.

బీజేపీలో చేరకుండా ఇపుడు వీళ్ళని కాపాడుకోవటమే అధికారపార్టీకి పెద్ద సమస్య అయిపోయింది. ఒక్కొక్కళ్ళకు లక్షల రూపాయలు ముట్టచెబుతున్నా పార్టీలోనే కంటిన్యు అవుతారనే గ్యారెంటీ లేదు. ఒకవేళ పార్టీలోనే ఉన్నా అభ్యర్ధి విజయానికి పని చేస్తారనే నమ్మకం లేదు. దాంతో ఇంతమందిని వ్యతిరేకం చేసుకునైనా సరే కూసుకుంట్లనే కేసీయార్ అభ్యర్థిగా ప్రకటిస్తారా ? అనేది ఆసక్తిగా మారిపోయింది.