Begin typing your search above and press return to search.
అట్టుడుకుతున్న అమెరికా.. దాడులు.. ప్రతిదాడులు
By: Tupaki Desk | 15 Nov 2020 11:30 AM ISTఅమెరికన్లే ఫస్ట్ అన్న డొనాల్డ్ ట్రంప్ ఓటమిని అక్కడి వామపక్ష కార్యకర్తలు స్వాగతిస్తుండగా.. రిపబ్లికన్ అభిమానులు వ్యతిరేకిస్తున్నారు. పరస్పరం విధ్వంసాలకు దిగుతున్నారు. గెలుపు సంబరాలు చేసుకుంటున్న డెమొక్రాట్లపై దాడులకు దిగుతున్నారు.
వాషింగ్టన్ డీసీలో తాజాగా ట్రంప్ మద్దతుదారులు వర్సెస్ వామపక్ష కార్యకర్తలు దాడులు, ప్రతిదాడులతో రెచ్చిపోయారు. తాజాగా ట్రంప్ కు మద్దతుగా చేపట్టిన ర్యాలీ హింసాత్మకంగా మారిపోయింది. దాడులు, ప్రతిదాడులు, అరెస్టులతో అల్లకల్లోలంగా మారింది.
తాజాగా వామపక్ష కార్యకర్తలు ట్రంప్ మద్దతుదారులను వెంబడించారు. ఒక డౌన్ టౌన్ హోటల్ ను ముట్టడించారు. పోలీసులు వారిని నిలువరించేందుకు కష్టపడ్డారు. చివరకు పెప్పర్ స్ర్పేను ఉపయోగించి బలవంతంగా జనాన్ని అక్కడి నుంచి చెదరగొట్టారు.
ట్రంప్ మరో నాలుగేళ్లు ప్రెసిడెంట్ కావాలని.. మోసపూరిత పథకాలతో ఎన్నికల్లో ట్రంప్ ను ఓడించారని వేలాదిమంది ఆయన మద్దతుదారులు శనివారం దేశ రాజధాని వాషింగ్టన్ డీసీలో ర్యాలీ తీశారు. కానీ వామపక్ష కార్యకర్తలు వైట్ హౌస్ కు దగ్గర్లో ట్రంప్ కు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేశారు. ట్రంప్ మద్దతుదారులు అక్కడికి రావడంతో హింసాత్మక వాతావరణం ఏర్పడింది.
వామపక్ష వారిని అదుపుచేయడానికి.. ట్రంప్ మద్దతుదారులను రక్షించడానికి పోలీసులు ప్రయత్నించారు. హింసాత్మక దాడులకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నారు.
వాషింగ్టన్‌లో చీకటి పడుతున్న కొద్దీ.. పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారిపోయాయి. ఈ ఘర్షణల్లో పలువురికి గాయాలయ్యారు. వారిని అడ్డుకోవడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. పరిస్థితి అదుపు తప్పడం నేషనల్ గార్డులను తరలించాల్సి వచ్చింది. మారణాయుధాలతో దాడులకు దిగడంతో ఇద్దరికి కత్తిపోట్లు అయ్యాయి. ఈ ఘర్షణల్లో కొందరు పోలీసులు గాయపడ్డారు.