Begin typing your search above and press return to search.

ప్లిఫ్‌ కార్ట్‌ లో 'ఆ' అమ్మ‌కాలు ఆగిపోయాయి

By:  Tupaki Desk   |   11 Dec 2015 4:47 PM GMT
ప్లిఫ్‌ కార్ట్‌ లో ఆ అమ్మ‌కాలు ఆగిపోయాయి
X
ఆన్‍ లైన్ మార్కెట్ దిగ్గజం ప్లిఫ్ కార్ట్ త‌న అభిమానుల‌కు చేదు వార్త‌ను అందించింది. దేశంలో మారుతున్న అభిరుచులు పసిగట్ట‌డంలో ఎప్పుడూ ముందుండే ప్లిఫ్ కార్ట్ తాజాగా త‌న ఆన్‌ లైన్‌ స్టోర్‌ లో ఆయా వ‌స్తువుల‌ను జోడించ‌డం వ‌దిలేసి వ‌ర‌ల్డ్ ట్రెండ్ ప్ర‌కారం తీసివేత‌కు శ్రీకారం చుట్టింది. ఇంత‌కీ ప్లిఫ్‌ కార్ట్‌ ఏం చేసిందంటే... తన ఆన్‍ లైన్ స్టోర్ నుండి ఈ‍-బుక్స్ ను తొలగిస్తున్నట్టు ప్ర‌క‌టించింది. మన దేశంలో ప్రింట్ పుస్తకాలకు విపరీతమైన ఆద‌ర‌ణ ఉన్నందున, ఆన్‍ లైన్‍ లో ఆ పుస్తకాలకు పెద్ద‌గా మార్కెట్ లేద‌ని వాపోయింది. అందుకే తాము ఈ బుక్స్‌ ను తీసివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దీంతో ఫ్లిఫ్‍ కార్ట్ లో ఈ బుక్స్ నేటి నుంచి లభించవు.

అయితే ఇప్పటి వరకు సబ్‍ స్క్రిప్షన్ చెల్లించి కొనుగోలు చేసిన పుస్తకాలను, కెనడా అధారిత ఈ‍బుక్స్ ఆన్‍ లైన్ కంపెనీ కోబో ద్వారా అందిస్తారు. ఇదిలాఉండ‌గా...ప్రముఖ సర్వే సంస్థ నీల్సన్ పేర్కొన్న వివరాల ప్రకారం, ఆంగ్ల పుస్తకాలు అమ్మకాలలో మన దేశం ప్రపంచంలో రెండవ స్థానాన్ని ఆక్రమించింది. అయినా సరే, ఆన్‍ లైన్ మార్కెట్‍ లో ఆదరణ లేదంటే, అచ్చులోనే పుస్త‌కాల‌ను చ‌దువుకోవాల‌నే అభిలాష‌కు ప‌రిస్థితులు అద్దంప‌డుతున్నాయని మార్కెట్ విశ్లేషిస్తోంది.