Begin typing your search above and press return to search.

ఫ్లిప్ కార్ట్ ‘లెక్క’ మామూలుగా లేదు..

By:  Tupaki Desk   |   7 Oct 2016 10:30 PM GMT
ఫ్లిప్ కార్ట్ ‘లెక్క’ మామూలుగా లేదు..
X
బిగ్ బిలియన్ డేస్ అంటూ నాలుగు రోజుల పాటు ఈ నెల 2వ తేదీ నుంచి గురువారం వరకు ఆన్ లైన్ షాపింగ్ సంస్థ ఫ్లిప్ కార్ట్ చేపట్టిన తగ్గింపు ధరల విక్రయాల దెబ్బకు సేల్స్ అమాంతం పెరిగింది. సేల్స్ ముగిసిన తరువాత ఫ్లిప్ కార్టు అధికారికంగా వెల్లడించిన లెక్కలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. కోట్లాది వస్తువుల అమ్మకం - కోట్లాది రూపాయల వ్యాపారం ప్రతిసెకనులో వేలాది వస్తువుల విక్రయం.. అదీ ఫ్లిప్ కార్ట్ సేల్స్ మోత. ఇంతకీ ఆ లెక్కలేంటో చూద్దామా..

- ప్రతి సెకండుకు ఒక హెడ్ ఫోన్ సెట్ విక్రయించారు. అంటే రోజుకు 86400 సెకండ్ల లెక్కన అయిదు రోజుల్లో 4,32,000 హెడ్ ఫోన్లు విక్రయించారన్నమాట.

- మహిళలు ధరించే టాప్ లు నిమిషానికి 20 సేల్ అయ్యాయి. అంటే రోజుకు 1440 నిమిషాల లెక్కన మొత్తం సేల్ లో 1,44,000 టాప్ లు అమ్ముడయ్యాయి.

- ప్రతిరోజూ విక్రయాలు మొదలైన తొలిగంటలో సెకనుకు 100 ఫోన్లు అమ్ముడయ్యాయి. అంటే అయిదు రోజుల సేల్ లోని తొలి అయిదు గంటల్లోనే 18 లక్షల మొబైల్ ఫోన్లు సేలయ్యాయి.

- ఇక టీవీల విషయానికొస్తే వివిధ స్క్రీన్ సైజులున్న టీవీలు విక్రయమైనవన్నీ ఒకదాని పక్కన ఒకటి పేర్చితే 6 వేల క్రికెట్ పిచ్ లు నిండిపోతాయట.

- పురుషుల దుస్తులు 80 వేల మీటర్లు విక్రయించారు. అంటే ఎవరెస్టు ఎత్తు కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ.

- కర్టెన్లు, ఇతర దుస్తులు 58 లక్షల మీటర్లు అమ్ముడుపోయాయి.

- ఇక విక్రయమైన మొత్తం పెన్ డ్రైవులు - మెమొరీ కార్డుల కెపాసిటీ అంతా కలిపితే ఎంతోతెలుసా? 80 లక్షల గిగాబైట్లు.

- ఫ్లిప్ కార్టుకు కేవలం సేల్ తోనే కాదు వేరే లాభం కూడా బాగానే వచ్చింది. ఈ సేల్ సమయంలో ఆ సైట్ కు వచ్చిన లైకులు - ట్వీట్లు - షేర్ లు - వీడియో వ్యూస్ అన్నీ కలిపి మొత్తం 1,10,00,000 వచ్చాయి. అంటే సైట్ పాపులారిటీ మరింత పెరిగి యాడ్ ఆదాయం పెరగబోతోంది.

- కొనుగోలు చేసినవారికి పార్సిల్ చేసిన వస్తువుల మొత్తం బరువు ఒకటిన్నర కోట్ల కేజీలు

- ఇక ఎక్స్జేంజ్ ఆఫర్లు - నో కాస్ట్ ఈఎంఐ వల్ల వినియోగదారులకు 150 కోట్ల మేర ఆదా అయిందట.

- తగ్గింపు ధరలు - ఇతరత్రా అన్నీ కలిపి మొత్తం వినియోగదారులకు సేవ్ అయింది వెయ్యి కోట్లు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/